వేశ్యలతో వేమన మోసం చేసి పొందిన జ్ఞానం

224

విశ్వదాభిరామ వినురవేమ అనే ఈ మాట వినని తెలుగు వారు ఉండరు
వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకం చెప్పే మాట
అంత ప్రఖ్యాతి గాంచిన వేమన కోన్ని కోట్ల మందికి ఓ విధాతగా మారారు.
సుమారు 1652 – 1730 మధ్య కాలములో వేమన జీవించారు.
వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు.
ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు. ఇంతకీ వేమన ఎవరు ? ఆయన రాసిన పద్యాలు ఏమిటి? ఆయన చరిత్రలో అంతలా ఎందుకు నిలిచారు అనేది చూద్దాం.

మనకు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.

కడపలో వేంపల్లి దగ్గరలో గండిలో వీరన్నగట్టుపల్లి ఆయన జన్మస్ధలం … ఆయన యవ్వనంలో వేశ్యాలోలుడై తిరిగేవారు. బంధువులు అతన్ని అసహ్యించుకొనేవారు.. కాని వదిన మాత్రం చిన్నపిల్లవాడిని వలె ఆభిమానించేది. ఒక వేశ్య వేమనని వలలో వేసుకొని, అతని దగ్గర అన్ని నగలు సాధించుకొని, చివరకు అతని వదినగారి ముక్కుపుడక తెమ్మని అడిగింది.. మంగళసూత్రం వలె ముత్తయిదు చిహ్నమైన ముక్కుపుడక ఇవ్వడానికి ముందు వదిన పెట్టిన నియమం వల్ల , వేమన తాను తుచ్ఛమైన శారీరిక సౌఖ్యాలకోసం వెంపర్లాడుతున్నానని గ్రహించాడు, దీంతో నేను చేసింది తప్పు అని జ్ఞానాన్ని ప్రసాదించిన వదినను కోరాడు..

Image result for vemana

తరువాత వ్యవసాయం చేశాడు వేమన. ఎవరికీ పనికిరాని వెర్రిపుచ్చకాయలు సాగుచేశాడు అని అందరూ అనేవారు, అలా ఓ యజమాని దగ్గర పుచ్చకాయలు సాగుచేస్తూ పనికి కుదిరాడు, చివరకు ఆ పొలం యజమానీ కూలిగా తన దగ్గర పని చేసిన వేమనకు, ఆ పుచ్చకాయలే ఇస్తానన్నారు. అతిపేదరికంతో బాధపడుతున్న కుటుంబం అలా పుచ్చకాయలు తీసుకెళ్ళి వాటిని తెరచి చూస్తే అందులో మణులున్నాయి, దీంతో వేమన అన్న కుటుంబం వాటిని తీసుకున్నారు, వారు అలా ధనవంతులు అయ్యారు. తరువాత ఆ సంపదతో వేమన అన్న భాగ్యవంతుడయ్యారు.

వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పారు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించారు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందారు.

తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందారు. వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధమైనది కదిరి తాలూకాలోని కటారుపల్లె.

Content above bottom navigation