వైఎస్సార్ ఇళ్ళ పథకం మొత్తం ఫ్రీ.. ఆనందంలో AP ప్రజలు

144

సంక్షేమ పథకాల అమలుతో పాలనలో దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం జగన్. అమ్మ ఒడి తర్వాత మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పేదోడి సొంతింటి కలను నెరవేర్చుతానని పాదయాత్ర చేసిన సమయంలో జగన్‌ మాటిచ్చారు. ఇప్పుడా మాటను నిజం చేయబోతున్నారు. ఈ పథకంలో భాగంగా ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. 2020 సంవత్సరం ఉగాది పండుగ నాటికి 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేదలందరికీ ఇళ్లు పథకానికి ధరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ధరఖాస్తుతో పాటు రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ జిరాక్స్ లేని వారు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి ధరఖాస్తు చేసుకోవచ్చని సమాచారం. ఇక ఇల్లు మంజూరు అయినా తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వమే చేపిస్తుంది. దీనిని ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోదు, అంత ఫ్రీగానే ఇల్లు పంపిణి చేస్తుంది.

Image result for ysr homes

ఇక ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై అధికారులతో సమీక్షించారు జగన్‌. ప్రతిపేదవాడికి ఇళ్ల పట్టాలు అందాలని.. అక్రమాలు జరిగితే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అధికారులు హాజరయ్యారు. ప్రజాసాధికార సర్వే అన్నది ప్రమాణం కాకూడదని.. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రామాణికం కావాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తిస్తున్న స్థలాలు ఆవాస యోగ్యంగా ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోకూడదని అధికారులకు సీఎం సూచించారు. ఇక లబ్ధిదారులకు ఉపయోగం లేని చోట స్థలాలు ఇవ్వడంలో అర్ధం లేదని. వారికి ఆవాసయోగ్యంగా ఉండాలన్నారు. ఈ అంశాలను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇళ్ల పట్టాల కోసం అసైన్డ్‌ భూములను తీసుకోవద్దని సీఎం సూచించారు. ఇళ్ల పట్టాల కోసం సడలించిన అర్హతల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్‌ ప్లే చేయాలని చెప్పారు.

Image result for ysr homes

ఇక ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలపై లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతే ప్లాటింగ్‌ చెయ్యాలన్నారు. లేకపోతే డబ్బు వృథా అవుతుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థలం లేనివారు ఎవ్వరూ ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం.. ఫిబ్రవరి 15 నుంచి తానే స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తానన్నారు. రాండమ్‌గా ఒక పల్లెలోకి వెళ్లి పరిశీలిస్తానన్నారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. పొరపాట్లు జరిగితే కచ్చితంగా అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎమ్మార్వోలు ఖాళీగా ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను అందించనున్నారు. అధికారులు ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తో లింక్ చేసి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలను లింక్ చేస్తారు. లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాక ఐదు సంవత్సరాల పాటు ఆ భూమిని ఎవరికీ అమ్మకూడదు. ఐదు సంవత్సరాల తరువాత మాత్రం భూములను అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో స్థలాలు పొందిన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం పొందుపరుస్తుంది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation