వైరల్ వీడియో : ప్రేమికుడి వింత ప్రపోజల్ ప్రియురాలి కొంప ముంచింది..ఏం జరిగిందో మీరే చూడండి.

146

ప్రేమ అనేది అర్ధం చెప్పలేని అనుభూతి.సృష్టిలోని ప్రతి జీవి , మనిషి ప్రేమించగలగడం అనేది ఒక అద్భుతమైన వరం. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, లవ్ అనేది అనిర్వచనీయమైనది. దానికి పరిమితులు, హద్దులు కులం మతం అనేవి ఉండవు. ఇక వయసులో ఉన్నవారు ప్రేమలో పడితే వాళ్లకు అన్నీ అపురూపమే. మొదటి ప్రేమ, మొదటి ప్రపోజల్ ఎప్పుడు గుర్తుండిపోయే మెమోరి. అందుకే యువత వివిధ రకాలుగా ప్రపోజ్ చేసి ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ కాలపు కుర్రాళ్లందరిలాగే ఓ యువకుడు కూడా తన ప్రేయసికి కొత్తగా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ.. ఆ కొత్త లవ్ ప్రపోజల్ ప్రియురాలి కొంప ముంచింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

ఒక చేత్తో గులాబి, మరో చేత్తో ప్రేమలేఖ పట్టుకుని లవ్ ప్రపోజ్ చేసే రోజులు పోయాయి. లవ్ ప్రపోజల్ అంటే ప్రేమికురాలికి మాత్రమే కాదు, అందరికి గుర్తుండిపోయేలా ఉండాలని ప్రపోజల్ ని కొత్తగా ప్లాన్ చేస్తున్నవారెందరో. అలా ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ కి గాల్లోనే ప్రపోజ్ చేయాలని భావించాడు ఒక యువకుడు.. అనుకున్నట్టగానే విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత విమానంలోని ఎయిర్ హోస్టెస్‌ గా ఉన్న గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేశాడు. విమానంలో ఉద్యోగ బాద్యతలు నిర్వర్తిస్తున్న టైంలో సడెన్‌గా అతడు తనకు ప్రపోజ్ చేయడంతో ఏం చేయాలో తెలియక మొదట షాక్‌ కు గురయింది. తర్వాత మనోడి ప్రపోజల్ నచ్చి ఓకే చెప్పింది. వాళ్ల లవ్ అయితే సక్సెస్ అయింది కానీ.. విమానంలో జరిగిన ఈ ఘటన వల్ల ఆ ఎయిర్ హోస్టెస్ జాబ్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నది.

A Love Proposal Makes Trouble For His Girl-

మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ప్యాసెంజర్ల బాగోగులు చూడకుండా నీ పర్సనల్ పనులను చేసుకోవడమేందని ఆ యువతిని జాబ్‌లోనుంచి పీకేసింది సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ. ఆ యువతికి ప్రపోజ్ చేస్తుండగా కొంతమంది వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ విషయం కాస్త ఎయిర్‌లైన్స్ అధికారులకు తెలియడంతో ఆమె జాబ్‌కు ఎసరొచ్చింది. అదండీ అసలు సంగతి.. ఇప్పుడు తన ఉద్యోగం పోగొట్టిన ప్రేమకి బ్రేక్ పడుతుందో.. లేదంటే ఉద్యోగం కంటే ప్రేమే ముఖ్యం అనుకుంటుందో మరి. ఏది ఏమైతే ఏమి ఉద్యోగం పోయిన జీవితాంతం గుర్తుండిపోయే ఒక మెమొరీ వాళ్లకు దక్కింది.

Content above bottom navigation