శాపంతో ఎడారిగా మారిన పుణ్యక్షేత్రం.. ఆశ్చర్యం కలిగించే నిజాలు..

276

అదొక ఊరు. క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. పక్కనే కావేరీ నది.. కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. ఇంతకీ ఎక్కడిదా ఊరు? ఎవరా రాణి? ఆమెకీ మైసూరు రాజ్యానికీ మధ్య సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే తలకాడు గురించి తెలుసుకోవాల్సిందే..

కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ‘తలకాడు’ అనే పుణ్యక్షేత్రం ఉంది. క్రీ.శ మూడో శతాబ్దం నుంచే ఈ ప్రాంతం అనేక రాజులకు ముఖ్య నగరంగా ఉండేది. అసలు ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు రావడం వెనుక ఓ స్థలపురాణ కథ ఉంది. ఒకప్పుడు సోమదత్తుడు అనే రుషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట. ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా, వారిని అడవి ఏనుగలు చంపేశాయట. శివభక్తి పరాయణులైన సోమదత్తుడు, అతని శిష్యులు మరుజన్మలో అడవి ఏనుగులుగా జన్మించి అక్కడే శివుని ప్రార్థించసాగారు. ఒక బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకి పూజలు చేయసాగారు. కాలం ఇలా గడుస్తుండగా తల, కాడు అనే ఇద్దరు కిరాతులు అక్కడకు చేరుకున్నారు. పచ్చపచ్చగా కళకళలాడుతున్న ఆ బూరుగు చెట్టుని చూసి వారికి ఆశ పుట్టింది. వెంటనే దానిని నరకడం మొదలుపెట్టారు. కానీ గొడ్డలి వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారడం చూసి వాళ్లని నోట మాటరాలేదు. ఆ సమయంలో ఆకాశవాణి ఒకటి వారికి వినిపించింది. తాను పరమేశ్వరుడిననీ, తనని పూజిస్తున్న సోమదత్తుని కోసం బూరుగు చెట్టులోనే నివసిస్తున్నాననీ తెలిపింది.

ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన తల, కాడులతో పాటుగా ఏనుగుల రూపంలో ఉన్న భక్తులందరూ కూడా అంగవైకల్యాన్ని పొందారు. తనకు కలిగిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తికలవాడు కావడం చేత, అక్కడ వెలసిన పరమేశ్వరుని ‘వైద్యనాథుని’ గా కొలవడం స్టార్ట్ చేశారు.. క్రమేపీ ఆ ప్రదేశాన్ని ‘తలకాడు’ అని పిల్చుకుంటూ, అక్కడ వైద్యనాథునికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. తలకాడు అనేక రాజ్యాలకు ముఖ్యనగరంగా మారడంతో ఇక్కడ వైద్యనాథుని ఆలయంతో పాటుగా మరో నాలుగు శివాలయాలనీ నిర్మించారు. పాతాళేశ్వర, అర్కేశ్వర, మరులేవ్వర, మల్లికార్జున, వైద్యనాథ ఆలయాలే ఈ అయిదు శివాలయాలు. ఈ అయిదు శివాలయాలనీ కలిపి పంచలింగాలుగా పిలుచుకుంటారు. వీటితో పాటుగా మరో పాతిక బ్రహ్మాండమైన ఆలయాలు ఈ తలకాడులో ఉన్నాయి. వాటిలో రామానుజాచార్యులు నిర్మించారని చెబుతున్న ‘కీర్తినారాయణ’ ఆలయం ప్రముఖమైనది.

Image result for talakadu temple

ఇలా తలక్కాడు ఆలయానికి ఒక చరిత్ర ఉంది. ప్రస్తుతానికి ఈ ఆలయాలలో చాలావరకు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది కట్టడాలలోకి మాత్రమే ప్రవేశించే వీలు ఉంది. వేల ఏళ్ల చరిత్ర కలిగి, నదీతీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. దీని వెనుక ఒక రాణి శాపం ఉంది. ఆ కథలోకి వెళ్తే..

1399 నుంచి 1950 వ‌ర‌కు అంటే ఇండియా రిప‌బ్లిక్ అయ్యేంత‌వ‌ర‌కు మైసూర్ ను ఒడియార్స్ ఫ్యామిలీనే ప‌రిపాలించేది. అయితే విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాన్ని ప‌రిపాలిస్తున్న తిరుమ‌ల రాజా రాజ్యాన్ని మైసూర్ ను ప‌రిపాలించే రాజా ఒడియార్ 1 అన్యాయంగా లాక్కొన్నాడు. దీంతో కోపోద్రికురాలైన రాజు తిరుమ‌ల‌రాజా భార్య అల‌మేల‌మ్మ రాజా ఒడియార్ మీద తీవ్ర‌మైన ద్వేషం పెంచుకుంది. త‌ర్వాత ఆమె రాజ్యం వ‌దిలేసి త‌న ఆభ‌రణాల‌ను తీసుకొని త‌ల‌కాడు గ్రామానికి వెళ్లిపోయింది. అయితే అల‌మేల‌మ్మ తీసుకెళ్లిన ఆభ‌ర‌ణాల‌ను తీసుకురావాల‌ని ఒడియార్ రాజా తన సైనికుల‌ను ఆదేశిస్తాడు. దీంతో అల‌మేల‌మ్మను చుట్టుముడుతుంది ఒడియార్ సైన్యం. అప్పుడు మైసూర్ రాజ్యం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌ద‌ని, ఆ రాజ్యాన్ని ఏలే రాజుల‌కు పిల్ల‌లు పుట్ట‌రని, త‌ల‌కాడు ఎడారిలా మారుతుంద‌ని యుక్త వ‌య‌సులోనే రాజులు చ‌నిపోతారని శ‌పించి కావేరీ న‌దిలో దూకింది అలమేల‌మ్మ‌. ఈ ఘ‌ట‌న జ‌రిగిన సంవ‌త్స‌రం 1612 అని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. అల‌మేల‌మ్మ శ‌పించిన‌ట్టుగానే త‌ల‌కాడు ఎడారిలా మ‌రిపోయింది. మైసూర్ ను ఏలే రాజుల‌కు పిల్ల‌ల భాగ్యం క‌ల‌గ‌లేదు. ఇంకా యుక్త వ‌య‌స్సులోనే చాలా మంది ఒడియార్ రాజులు మ‌ర‌ణించారు.

Image result for talakadu temple

ఇలా తలకాడు మొత్తం ఎడారిలా మారిపోతుంది. ఇదంతా అల‌మేల‌మ్మ శాపం ఫ‌లిత‌మేన‌ని భావించారు ఒడియార్ రాజులు. అందుకే బంధువుల‌లో ఎవ‌రో ఒక‌రిని ద‌త్త‌త తీసుకొని వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మైసూరు రాజుగా ప‌ట్టాభిషేకం చేసేవారు. ప్ర‌స్తుత రాజు యుదువీర్ ను కూడా ద‌త్త‌త తీసుకున్నారు. అయితే యుదువీర్ భార్య త్రిషికా కుమారి దేవి గ‌ర్భ‌వ‌తి అవ్వ‌డంతో ఆ శాపానికి ఇక విముక్తి క‌లిగిన‌ట్టేన‌ని, ఇక నుంచి మైసూర్ రాజ్యానికి అంతా మంచే జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు మైసూరు ప్ర‌జ‌లు.

Content above bottom navigation