శివరాత్రి రోజు ఈ ఆలయంలో మాత్రమే జరిగే అద్భుతం.. చూస్తే మీ జన్మ ధన్యం

105

శివరాత్రి.. శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. అంతేకాదు, దేశంలో అత్యధికమంది జరుపుకునే పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి. ఇక శివుడు అనగానే మనకు దేవాలయాల్లో శివలింగం కనిపిస్తుంది. శివుడు అంటే నిరాకారుడు. ఒక ఆకరంలేని వ్యక్తి. అందుకే శివుడిని శివలింగం రూపంలో కొలుస్తారు. అయితే, దేశంలోనే ఎక్కడా కనిపించని ఓ వింత మనకు ఆంధ్రప్రదేశ్ లోని ఓ దేవాలయంలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని రత్నగిరి సమీపాన హేమావతి అనే గ్రామం ఉంది. ఈ గ్రామం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ, ఆ గ్రామంలోని గుడిలో జరిగే వింత గురించి మాత్రం ప్రపంచానికి తెలుసు. ఆ వింత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా నుండి 150 కిలోమీటర్లకు దూరంగా ఉన్న అమరాపురం మండలంలోని హేమావతిలో శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ఎంత మహిమ గలదో అంతే పురాతనమైనది కూడా. పూర్వం నలంబరాజులు 7వ శతాబ్ధంలో హేమావతిని రాజధానిగా చేసి సుమారు 350 సంవత్సరాలు తమ రాజ్యాన్ని పాలించారని చెబుతారు. వారి కాలంలోనే ఈ ఆలయాన్ని స్థాపించారని, ఆ తర్వాత వచ్చిన పల్లవ రాజులు మొదలైనవారు అభివృద్ధి చేశారని స్థానికుల కథనం. ఇక మీరు కాశి విశ్వనాధుని దేవాలయంలో చూసినా, మన ఇంటి దగ్గరిలోని గుడిలో చూసినా పరమేశ్వరుడు లింగ రూపంలోనే దర్శనమిస్తున్నారు.. మానవ ఆకారంలో ప్రతిమరూపంలో దర్శనమివ్వడం అనేది చాలా తక్కువ దేవాలయాలలో మాత్రమే జరుగుతుంది. అలా విగ్రహరూపంలో దర్శనమిచ్చే అతి తక్కువ దేవాలయాలలో ఈ సిద్దేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. పరమేశ్వరుని ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. లింగరూపంలో దర్శనమివ్వడానికి ఏ కారణం అయితే ఉంటుందో విగ్రహ రూపంలో దర్శనమివ్వడానికి కూడా ఒక బలమైన కారణం ఉంటుంది.

ఇక ఈ ఆలయంలో ఉన్న మరొక విశిష్టత గురించి చెప్పాలంటే.. శివరాత్రి రోజున సాయంకాలం సమయంలో సూర్యకిరణాలు నేరుగా సిద్దేశ్వర స్వామి వారి నుదుటిపై పడతాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి భక్తులు ఆ దేవాలయానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఆలయ గోడలు, గోపురం మీద చెక్కిన శిల్పాల గురించి. దేవాలయం అతి పురాతనమైనది కావడంతో నాటి కళాకారుల శిల్ప కళాబిరుచి వీటిలో మనకు తెలుస్తుంది. ఈ గుడి ఇరుకుగా కాకుండా చాలా విశాలంగా సుమారు 12 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ దేవాలయంలోనే కాలబైరేశ్వర, పంచలింగేశ్వర, మల్లేశ్వర స్వామి, విరుపాక్షేశ్వర స్వామి మొదలైన ఆలయాలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి అరుదైన ఆలయం మరెక్కడా లేదు. ఆలయ ఆవరణంలో దొడ్డేశ్వరస్వామి శివలింగాకారంలోను, దీనికి ఎదురుగా ఐదు అడుగుల ఎత్తు ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులకు సువిశాలమైన పార్క్‌ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అలాగే ఆరు అడుగుల శివ లింగం కూడా ప్రత్యేక శక్తివంతగా, ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అన్ని రకాల పూజలు జరుగుతాయి. దేవాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రితో పాటు, పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి.

Content above bottom navigation