శివరాత్రి రోజు మరిచిపోయి కూడ ఈ తప్పు చెయ్యకండి…చేస్తే కోటిశ్వరుడైన బిక్షగాడవుతాడు

116

సాధారణంగా ప్రతి నెలా కృష్ణపక్షమి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఇందులో బహుళశద్ద పక్షమిలో వచ్చే శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. దీనిని మహాశివరాత్రి అంటారు. కేవలం ఆ ఒక్కరోజున శివుణ్ణి పూజిస్తే చాలు. ఆ సంవత్సరం మొత్తం శివుణ్ణి పూజించినంత ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆ ఒక్కరోజులో శివుణ్ణి పూజిస్తే మనం ఎన్నో జన్మల నుండి చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకే మన పెద్దలు జన్మకో శివరాత్రి అని అంటారు. అంటే మనం జన్మలో ఒకసారైనా శివుణ్ణి పూజిస్తే చాలని అర్థం.

ఒక రోజు శివుణ్ణి పార్వతీదేవి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాములలోను మొదట పాలతోను, తరువాత పెరుగుతోనూ, తరువాత నీటితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే తనకు ప్రీతి కలుగుతుందని చెప్తాడు. మరుసటి రోజు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడు భోదిస్తాడు. అందుకే మన హిందువులు మహాశివరాత్రి రోజున ఎంతో భక్తిశ్రద్దలతో దేవుణ్ణి పూజిస్తారు. బిల్వ పత్రాలతో శివుడ్ని పూజిస్తే ఎంతో మంచిది. అలాగే అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఉపవాసం ఉండి, జాగరణ చేస్తే కూడా చాలా మంచిది. మహాశివరాత్రికి ఎంతో విశిష్ఠత ఉంది.

Image result for mahashivratri

అంతటి విశిష్టమైన రోజు మహా శివరాత్రి రోజు అస్సలు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. మాంసాహారం, గుడ్డు తినకూడదు. మద్యం సేవించకూడదు. శివరాత్రి రోజు మూగ జీవులకు హాని చేయకూడదు. పగటి సమయంలో నిద్ర పోకూడదు. అబద్దాలు ఆడకూడదు. పిల్లలను, పెద్దవారిని ఊరికే తిట్టకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. శారీరక సుఖానికి దూరంగా ఉండాలి. మొక్కలను, చెట్లను నరకకూడదు. చీమకు కూడా అపాయం కలిగించకూడదు. ఇలా కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. ఇక మహాశివరాత్రి రోజున తప్పక చెయ్యాల్సింది జాగారం. జాగారం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. చాలా మంది జాగారం అంటే సినిమాలు గడుపుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. జాగారం చేసే సమయంలో భక్తి మార్గంలో ఉండి దేవుని పారాయణలో గడపాలి. కాబట్టి భక్తి మార్గంలో జాగరణ చెయ్యండి. ఇలా చేస్తే అంత మంచే జరుగుతుంది.

Content above bottom navigation