శివలింగాన్ని తవ్వి ఇల్లు కట్టాడు.. కళింగ నాగుపాము ఏం చేసిందో తెలిస్తే షాక్ ..

187

పొరపాటున పాము ఇంట్లోకి చొరబడితే ఎంత భయంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాముఎక్కడ కాటేస్తుందోనని భయపడిపోతాం. నలుగురూ చేరి దానిని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకేసారి 100 పాములు ఇంట్లోకి చొరబడితే ఎలా వుంటుంది? గుండెలో గుభిల్లుమంటుంది. అదీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కళింగ నాగు అయితే ప్రాణం అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆ ఇంటి యజమాని పరిస్థితి కూడా అలాగే అయింది.ఒకేసారి 100 పాములు అతని ఇంట్లో దర్శనమిచ్చాయి. మరి అన్ని పాములు అతని ఇంట్లోకి ఎందుకు వచ్చాయి.తర్వాత ఏమైంది.. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

కర్ణాటక రాష్టం చిక్ మగళూర్ లో నివసించే గిరీష్ అనే వ్యక్తి ఇంట్లోకి ఒకరోజు ఒక కళింగ పాము వచ్చింది. వెంటనే అధికారులకు ఫోన్ చేసి దానిని పట్టించాడు. దానిని అడవిలో వదిలేశారు. అయితే ఆ పామును వదిలిన కొన్ని రోజులకు అతనికి మరికొన్ని పాములు కనిపించాయి. వాటిని చుసిన ఆ ఇంటి సభ్యులు మళ్ళి పాములు పట్టుకునే అధికారికి ఫోన్ చేశారు. అతను వచ్చి చూసేసరికి ఆ ఇంటి వెనుకాల ఉన్న పుట్టలో వందలాది పాములు కనపడ్డాయి. అతని చుట్టూ పరిశీలించగా ఇంటి చుట్టూ ఆ విషసర్పాలే అతనికి కనపడడ్డాయి. అలా ఒకేసారి అన్ని విషసర్పాలను ఆ ఇంటి యజమాని భయంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఖాళీ చేసిన తర్వాత ఇంటిని పడగొట్టి చూడగా వందలకొద్దీ కళింగ నాగులు దర్శనం ఇచ్చాయి.

Image result for శివలింగాన్ని తవ్వి ఇల్లు కట్టాడు.

ఈ కళింగ నాగులు అరుదుగా ఉండే జాతి అని అధికారులు వెల్లడించారు. ఈ రకం పాములను దేవతామూర్తులుగా ప్రజలు నమ్ముతారు. అయితే ఇన్ని పాములు ఇక్కడ ఎలా ఉన్నాయని విచారణ చేపట్టగా..ఆ ఇల్లు ఉండే స్థలంలో ఒకప్పుడు దేవాలయం ఉండేదని, అక్కడ ఉండే శివుడికి నిత్యం పూజలు జరిగేవని, పాములు కూడా అప్పుడప్పుడు వచ్చేవని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఆ శివాలయం ఉండేచోట ఇల్లు నిర్మించడంతో ఆ పాములు ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చెయ్యడంతో ఆ ప్లేస్ లో మళ్ళి గుడిని కట్టించే ఆలోచనలో ఉన్నారు గ్రామస్తులు. ఇప్పటికి కూడా ఆ కళింగ నాగును శివుడికి ఇష్టమైన నాగుపాముగా గుర్తిస్తారు. పూర్వం ఈ నాగులను ఆ గ్రామంలో ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. అయితే రానురాను అవి కనిపించకుండా పోయాయని, ఇప్పుడు మళ్ళి దర్శనం ఇచ్చాయని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

Content above bottom navigation