సింగర్ కనికాపై కేసు నమోదు.. రాష్ట్రపతికి కరోనా పరీక్షలు..

164

ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా అన్న పేరు చెపితేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. Covid-19 ధారాళంగా విస్తరించడం వలన ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య క్రమేనా తగ్గుతుంటే.. ఇతర దేశాల్లో మాత్రం పెరుగుతున్నారు. మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలు కూడా దీని భారిన పడుతున్నారు. నిన్న సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కనికా కపూర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కనికా కపూర్ కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లివచ్చింది. అయితే ఆమెకు లండన్ లో కరోనా వైరస్ సోకింది. ఈ విషయం లక్నో ఎయిర్ పోర్ట్ లోనే తెలిసింది. క్వారంటైన్ లో ఉండమని డాక్టర్స్ ఆమెకు సలహా ఇచ్చారు. అయినా ఉండకుండా, నిర్లక్ష్యం వహించి లక్నోలోని ఓ డిన్నర్ కు హాజరైంది. ఆ డిన్నర్ లో ప్రముఖ సెలెబ్రిటీలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు రాజస్థాన్ ఎంపీ దుశ్యంత్ సింగ్ తో పాటుగా కనికా కపూర్ ఏర్పాటు చేసిన వేడుకకు హాజరయ్యారు. దీంతో ఆ డిన్నర్ కు హాజరైన పొలిటిషియన్లకు, ఆ పొలిటిషియన్లు పార్లమెంట్ కు హాజరుకావడంతో మరికొందరికి వైరస్ సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్ లో ఉన్నట్టుగా ప్రకటించారు. నిర్లక్ష్యం వహించినందుకు కనికాపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేశారు.

లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కనికా పై ‘‘నిర్లక్ష్యం‘‘ కింద పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 269,270 కింద కేసు నమోదు చేశారు. మార్చి 14 న ఆమెకు లక్నో ఎయిర్ పోర్టులో కనికాను పరీక్షించగా వైరస్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా సూచించారు. అయినప్పటికీ వారి మాటలను లెక్క చేయకుండా బయట తిరిగి పలువురికి వైరస్ సోకడానికి కారణమైంది. కాగా ఈ 10 రోజుల కాలంలో దుశ్యంత్ పలువురు రాజకీయయ నేతలతో సన్నిహితంగా మెలిగారు. అందులో 20 మంది ఎంపీలు ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. అంతేగాక అయన రాష్ట్రపతిని కూడా కలిసారు. దీంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ రాష్ట్రపతికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అధికారిక కార్యక్రమాలను రాష్ట్రపతి రద్దు చేసుకున్నట్టు సమాచారం. కనికా కపూర్ నిర్లక్ష్యానికి ఇప్పుడు పార్లిమెంట్ సభ్యుల్లో కూడా కరోనా భయం మొదలైంది. అయితే కనికా కపూర్ మాత్రం తాను మార్చి 11 న లక్నో ఎయిర్ పోర్టుకు వచ్చానని…మార్చి 9 న లండన్ నుంచి ముంబై ఎయిర్ పోర్టు లో దిగినట్టు చెబుతున్నారు.

Image result for కనికాపై కేసు నమోదు.

లక్నో ఎయిర్ పోర్టులో గాని, లక్నో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటికీ తనకు వైరస్ ఉన్నట్టు గుర్తించలేదన్నారు కనికా కపూర్. కనికా పై కేసు నమోదు చేయడానికి కొన్ని గంటల ముందు ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ ఓ మీడియాతో మాట్లాడుతూ…లక్నో ఎయిర్ పోర్టులో లోపాలున్నట్టు అంగీకరించారు. కనికా కపూర్ చెక్ చేయించుకోకుండా ఎలా వెళ్లిందనే విషయాన్ని తాను అధికారులతో మాట్లాడతానని చెప్పారు. కనికా కపూర్ హాజరైన డిన్నర్ పార్టీకి మంత్రి జై ప్రతాప్ సింగ్ కూడా హాజరయ్యారు. ఆయన ఇప్పుడు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. మార్చి 14న తాము డిన్నర్ కు హాజరైంది ఓ ఇంట్లోని గార్డెన్ లో జరిగిన బర్త్ డే పార్టీకని…నాతో పాటు పలువురు ప్రముఖులు, ఢిల్లీ నుంచి కొందరు వచ్చారని మంత్రి చెప్పారు.

Content above bottom navigation