స్టార్ హీరోకు కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్‌లో జాయిన్ అయిన హీరో..

91

ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా అన్న పేరు చెపితేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. Covid-19 ధారాళంగా విస్తరించడం వలన ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య క్రమేనా తగ్గుతుంటే.. ఇతర దేశాల్లో మాత్రం పెరుగుతున్నారు. మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలు కూడా దీని భారిన పడుతున్నారు. ఇప్పుడు ఒక స్టార్ హీరో వస్తుందేమో అని భయపడి ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ గదిలో ఉంటున్నాడు.. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సైతం తనకు తానుగా ఒంటరిగా దిగ్బంధించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తనకు అది సోకకుండా ముందు జాగ్రత్తగా తాను పూర్తిగా ఐసోలేషన్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు దిలీప్ కుమార్ ప్రకటించారు. ‘‘నాకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకూడదని సైరా (దిలీప్ కుమార్ భార్య) అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది’’ అని ట్వీట్‌లో దిలీప్ కుమార్ పేర్కొన్నారు. దేశ ప్రజలకు కూడా ఆయన జాగ్రత్తలు చెప్పారు. ‘‘అందరూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించాలని కోరుతున్నా. కరోనా వైరస్ అన్ని హద్దులను, సరిహద్దులను దాటుకొని వచ్చేస్తోంది. ఆరోగ్య శాఖలు జారీ చేసిన అన్ని సూచనలను పాటించండి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఇతరులను బహిరంగంగా కలవడం తగ్గించండి’’ అని దిలీప్ కుమార్ సూచించారు. దిలీప్ కుమార్ వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా ఆయనకి ఆరోగ్యం బాగోవడం లేదు. ఇప్పటికే రెండు మూడుసార్లు ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురిచేశారు. చాలా రోజులుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు కరోనా వైరస్ భయంతో దిలీప్ కుమార్ భార్య, ప్రముఖ నటి సైరా భాను ఆయన్ని ఐసోలేషన్ గదిలో పెట్టారు.

ఇక ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం గతవారం కరోనా వైరస్‌ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే హాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ టామ్‌ హ్యాంక్స్‌, రీటా విల్సన్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఓల్గా కురేలేంకో కూడా చేరింది. ఇక ఈ లిస్టులో ఇప్ప‌టికే ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు కూడా ఉన్నారు. లాస్ట్ వీక్ కరోనాతో బాధపడుతూ యూనివర్సల్‌ మ్యూజిక్‌ అధినేత, సీఈవో లుసియన్‌ గ్రినేజ్‌ ఆస్పత్రిలో చేరారు. ఇలా చాలామంది ప్రముఖులు కరోనా మూలాన హాస్పిటల్ బారిన పడుతున్నారు. మ‌రి ఈ వైర‌స్ ఎప్పుడు త‌గ్గు ముఖం ప‌డుతుందో ? ప్ర‌పంచం ఎప్పుడు శాంతిస్తుందో ? చూడాలి. ఇక కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలని చెబుతోంది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజా ప్రయోజన ప్రకటనలను జారీ చేస్తోంది.

Content above bottom navigation