హైదరాబాద్ లో దెయ్యాలు ఉండే 10 ప్రదేశాలు..

243

నిజాంల నగరం హైదరాబాద్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఈ గొప్ప చారిత్రాత్మక నగరంలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. దేశ, విదేశీ టూరిస్టులు కోరుకునే పర్యాటక ఆకర్షణలకు ఇక్కడ కొదవ లేదని చెప్పాలి. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ నగరంలోని ప్రముఖ ప్రదేశాలన్నీ పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతుంటాయి. అధిక జనాభాతో ఎప్పుడూ హడావిడిగా కనిపించే ఈ నగరంలో రాత్రైతే భయపెట్టే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు కూడా ఉండడం విశేషం. దెయ్యాలకు సంబంధించిన కధలతో ముడిపడి ఉన్న ఆ భయానక ప్రదేశాలు ఏమిటి? వాటి వెనుక కధ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

 1. డేడ్ లాక్ ఘర్
  హైదరాబాద్ లోని సీతాఫల్ మండీ ప్రాంతంలో దాదాపు 40 ఏళ్ల క్రితం ఒకటిన్నర లక్షల రుపాయల ఖర్చుచేసి ఈ భవనాన్ని నిర్మించారు. దీంతో దీనికి డేడ్ లాక్ ఘర్ అనే పేరు వచ్చింది. అయితే ఈ ఇంటి యజమాని గృహప్రవేశం చేసిన రోజే అతని భార్య చనిపోయింది. అతని భార్య ఒంటికి నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో భయపడిన అతను ఈ ఇంటిని మరో వ్యక్తికి అమ్మాడు. ఆ కొన్న వ్యక్తి కూడా ఈ భవనం కొన్న వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ భవనం చుట్టు పక్కలకు వెళ్లడానికి చాలా మంది భయపడుతున్నారు. ఇప్పటికి వారి ఆత్మలు అక్కడ తిరుగుతుంటాయని కొందరు అంటారు.
 2. ఉప్పల్ స్టేడియం..
  2005లో ఇద్దరు వ్యక్తులు తాము ఒక మూలలో నల్లటి ఆకారాన్ని చూశామని చెప్పారు. అంతే కాకుండా మమ్ముల్ని చంపడానికి వచ్చిందని కూడా తెలిపారు. దీనిని మొదట ఎవరూ నమ్మలేదు. అయితే తర్వాత చాలా మందికి ఈ ఆకారం కనిపించింది. దీంతో ఇప్పటికీ అక్కడ పనిచేసే వారు ఒంటరిగా ఉండటానికి భయపడతారు.
 3. శంషాబాద్ ఎయిర్ పోర్ట్..
  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ సమయంలో అనేక అల్లర్లు జరిగాయి. ఈ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడానికి ముందుకు రాని వారిలో కొంతమందిని చంపారని తెలుస్తోంది. మరికొందరిని బలవంతంగా వారే ప్రాణాలు తీసుకునేలా చేశారు. ఈ విషయమై విచారణ జరిగే సమయంలో ఒక వ్యక్తి తన తలను పూర్తిగా వెనక్కు తిప్పి విచారణ అధికారులను భయపెట్టి అక్కడి నుంచి మాయమయ్యాడు. ఇప్పటికీ ఆ విమానాశ్రయంలో రాత్రుల సమయంలో వింత శబ్దాలు వినిపిస్తుంటాయని అక్కడి వారు చెబుతారు.
 1. ​రోడ్ నెంబర్ 12లో స్మశానం, బంజారా హిల్స్
  హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేది. నిజాం రాజ్యంలోని కొందరు ప్రముఖులు ఈ ప్రాంతాన్ని తమ నివాస స్థలంగా మార్చుకుని వేట ప్రాంతంగా వినియోగించేవారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని రోడ్ నెంబర్ 12 లో స్మశానవాటిక ఉన్న ప్రదేశం దెయ్యాలతో వెంటాడబడుతుందని, ఇక్కడ అనేక విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లు స్థానికులు చెబుతుంటారు.
 2. ఖైరతాబాద్ కాలేజ్..
  ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ కు పక్కగా ఒక పాడుపడిన భవనం కనిపిస్తుంది. ఆ భవనంలోకి వెళ్లినవారు తిరిగి వచ్చినట్లు దాఖలాలు లేవని ఇక్కడి వారు చెబుతారు. గతంలో ఈ భవనం ఓ మెడికల్ కాలేజ్ గా ఉండేది. అయితే కొన్నేళ్ల క్రితం దీన్ని మూసివేశారు. ఆ సమయంలో కాలేజ్ స్టూడెంట్స్ తమ ప్రాక్టికల్స్ కు వినియోగించే శవాలను అక్కడ నుంచి తరలించి ఖననం చేయలేదు. ఈ శవాలే దెయ్యాలుగా మారి ఈ భవనం లోపలికి వెళ్లే వారి ప్రాణాలు తీస్తున్నాయన్న కథనం ప్రచారంలో ఉంది.
 3. ఎర్రమంజిల్..
  హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కాలనీ లోని ఒక ఇంటిని తల లేని ఒక దెయ్యం కాపాలా కాస్తూ ఉందని ఇప్పటికీ నమ్ముతారు. దాదాపు 50 ఏళ్ల క్రితం తన వద్ద అప్పు తీసుకొని సకాలంలో తీర్చని యువకుడిని చంపేశాడు. ఇతనే దెయ్యంగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడని చెబుతారు. అయితే ఈ తలలేని దెయ్యం ఇప్పటి వరకూ ఒక్కరికీ హాని చేయలేదని తెలుస్తోంది.
 1. కుందన్ భాగ్ లోని దెయ్యాల కొంప
  హైదరాబాద్ లోని కుందన్ బాగ్ లో 2002 ఏడాదిలో ఒక ఇంట్లో 56 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఇద్దరి బిడ్డల శవాలను పోలీసులు గుర్తించారు. వారు చనిపోయి అప్పటికే దాదాపు మూడు నెలలు కావొస్తోందని డాక్టర్స్ నిర్థారించారు. వారు బతికున్నప్పుడు కూడా విచిత్రంగా ప్రవర్తించేవారని చుట్టు పక్కల వారు చెబుతారు. అర్థరాత్రి పూట ఇంట్లో కొవ్వొత్తలు వెలిగించడం, రాత్రి సమయంలో మహిళ గొడ్డలితో తిరగడం, వారి గార్డెన్ లో రక్తంతో నింపిన సీసాలను ఉంచడం వంటివి చేసేవారని తెలుస్తోంది. ఇక వారు చనిపోయిన తర్వాత ఆ ఇంటి చుట్టు పక్కలకు ఎవ్వరూ వెళ్లేవారు కాదు.
 2. గోల్కొండ కోట..
  హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోల్కొండ కోటలో కూడా దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఈ ప్రదేశం కొంత మంది సైనికుల ఆత్మలు, ప్రఖ్యాత నర్తకి, గాయని తారామణి ఆత్మలు వెంటాడబడుతుందని నమ్ముతారు. కుతుబ్ షా రాజవంశ వేశ్యలలో తారామణి ఒకరు. ఈ కోటలో ఒక నీడ నృత్యం చేయడాన్ని చాలా సార్లు చూసినట్లు అక్కడ ఉండే వాళ్ళు చెబుతుంటారు. అకస్మాత్తుగా పాత్రలను ఎవరో విసరడం లాంటి శబ్దాలను, భయంకరంగా ఏడవడం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. అందుకే చీకటి పడిన తరువాత కోటలోకి సందర్శకులను అనుమతించరు.
Image result for హైదరాబాద్ లో దెయ్యాలు ఉండే 10 ప్రదేశాలు..
 1. రామోజీ ఫిలిం సిటీ..
  సినిమా షూటింగ్ లకు, టూరిస్టులకు ఎంతో ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం రామోజీ ఫిలిం సిటీ. చీకటి పడితే ఈ ప్రదేశం కూడా ఆత్మలతో వెంటాడబడుతుందని చెబుతారు. దీని వెనుక ఆశ్చర్యకరమైన కధలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ సినిమా చిత్రీకరణలు చేస్తున్నప్పుడు అద్దాల్లో వింత దృశ్యాలు కనబడడం, ఏదో తెలియని అదృశ్య శక్తి నెట్టడం వంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు లైట్ మెన్ లు, పలువురు నటులు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజాంల కాలంలో ఈ ప్రాంతంలోనే ఎన్నో యుద్ధాలు జరిగి ఎందరో సైనికులు మరణించినట్లు చెబుతారు. వారి ఆత్మలు ఈ ప్రదేశాన్ని వెంటాడుతున్నాయని నమ్ముతారు.
 2. రవీంద్ర నగర్ కాలనీ..
  రవీంద్రనగర్ లో 2012 లో జరిగిన ఆత్మహత్యల పరంపర హైదరాబాద్ లో భయానక ప్రదేశాల జాబితాలో ఒకటిగా ఈ ప్రదేశాన్ని నిలిపింది. ఒక దెయ్యం కారణంగా ఈ ఆత్మహత్యలు జరిగాయని ప్రజలు నమ్ముతారు. తమ ఇళ్లను కాపాడుకోవడానికి, ఆ కాలనీ వాసులు రాత్రి వేళల్లో జాగారం కూడా ఉండేవారు. ఆ భయానికి దాదాపు అరడజనుకు పైగా కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయి. చాలా ఇళ్లపై ఎర్రని రంగులో జై శ్రీరామ్ అని రాసి ఉండడం గమనించవచ్చు.

ఇలా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి దెయ్యాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా దెయ్యాలు కనిపించాయా? ఈ ప్రదేశాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

Content above bottom navigation