హై హీల్స్ వేసుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించకపోతే డేంజర్..

103

 చాలా మంది అమ్మాయిలు నడవటానికి కాస్త అసౌకర్యంగా ఉన్నా కాళ్లకి హై హిల్స్ వాడతారు, అంతేకాదు వారికి ఇబ్బంది వచ్చినా వడివడిగా అడుగులు వేస్తారు. మార్కెట్లోకి హైహీల్స్, పెన్సిల్ హీల్, షూస్ వంటి రకరకాల చెప్పులు వచ్చాయి. చూడటానికి ఒకే కాని ఇవి వేసుకుంటే మడం నొప్పులు విపరీతంగా ఉంటాయి.

ఇలాంటివి ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల మడమలు విపరీతమైన నొప్పి పుడతాయి అనేది 100 కి 100 మంది కంప్లైంట్ గా చెబుతారు. ఎత్తు చెప్పులను ధరించడం వల్ల కాళ్ళ నొప్పులు, ఆ తర్వాత కీళ్ళ నొప్పులు కూడా వచ్చే ప్రమాదము ఉంటుంది. ఈ చెప్పులను వేసుకొని ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు నిలబడి ఉన్నా కీళ్ళనొప్పులతో పాటు నడుమునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని చెప్పులు వల్ల ముని వేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు అలాగే కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలిగిపోవడం, పాదాలు దెబ్బతినడం గోళ్ల ఇన్ ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్స్ అంటున్నారు. పెన్సిల్ హీల్ వంటి వాటితో జారిపడి కాళ్ళు ఫ్యాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ.అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం చెప్పులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తులు తీసుకోవాలి.

Image result for high heels slippers

దాదాపు ప్రతి ఒక్క స్త్రీ కి ఎత్తు చెప్పులతో తో ప్రేమ, ద్వేషం వంటి రెండు సంబంధాలు కలిగి ఉంటారు. ఎందుకంటే హై హీల్స్ చాలా అందంగా ఉంటాయి. కాని ఎక్కువ కాలం ధరించడానికి మాత్రం అంత సౌకర్యంగా ఉండవు. అయితే చాలా మంది ఇవి ఇవి ధరించటానికి కష్టంగా ఉన్నా ధరిస్తూ ఉంటారు. అయితే వారు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే సెలబ్రిటీలు ఎలా అంత సేపు అవి వేసుకుంటారని ఆలోచిస్తారు . కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు కూడా ఎక్కువ సేపు వాటిని ధరించగలరు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం..

మనలో చాలా మంది చెప్పులు కొనేటప్పుడు అవి అందంగా , డిజైన్ ఎలా ఉంది అని మాత్రమే చూస్తాం… వాటిని ధరించి మనకి బాగున్నాయి అనిపిస్తే ఇక వాటినే తీసుకుంటాం.. కానీ ఎత్తు చెప్పులు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిని వేసుకొని ఎక్కువ సేపు నించో గలమా లేదా అన్నది చూసుకోవాలి. మీ మడమలకు సౌకర్యవంతంగా ఉండాలని మీరు కోరుకుంటే, మీరు సరైన రకమైన ఎత్తు చెప్పులను కొనుగోలు చేయాలి. బెల్ట్ ఉండే విధంగా చూసుకోండి.

మహిళలు ఎక్కువ పెన్సిల్ అలాగే సన్నగా ఉండే హై హీల్స్ ఎక్కువగా వేసుకుంటారు. ఎందుకంటే అవి అందంగా మరియి స్టైలిష్‌గా ఉంటాయి. కానీ వాటిని ధరించడం వల్ల మడమలుకు ఎప్పుడూ నొప్పిని కలిగిస్తాయి. మీరు మడమలు సౌకర్యంగా ఉండాలని కోరుకున్నట్లైతే .. కొన్ని రకాల ఎత్తు చెప్పులు సరిపోతాయి. అందుకే మీరు బ్లాక్ హీల్స్ వెడ్జెస్ వంటివి కొనుగోలు చెయ్యండి. ఇవి మీ పాదాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాంటి చెప్పులను కాస్త ఎక్కువ సేపు ధరించగలం అలాగే సౌకర్యంగాను ఉంటుంది.

కొత్త చెప్పులను కొనుగోలు చేస్తే వాటిని త్వరగా ధరించాలని చూస్తాం.. కానీ వాటిని ధరించే టప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తలో చెప్పులు కాస్త టైట్ ఉంటాయి దీని వల్ల కాలి పై మచ్చలు పడే అవకాశం ఉంది. అందుకే కొత్త చెప్పులను ధరించే ముందు కొంచెం వాటిని స్ట్రెచ్ చెయ్యండి. లేదా మందపాటి సాక్స్ మీద వాటిని ధరించి కొంత సమయం చుట్టూ నడవండి. ఈ చిట్కా మడమలను సౌకర్యవంతంగా చేస్తుంది..అలాగే బొబ్బలను నివారిస్తుంది. చెప్పులు గట్టిగా ఉంటె విప్పటానికి బ్లో డ్రైయర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

ఎత్తు చెప్పులను ప్రతి మహిళా ఇష్టపడతారు. కానీ వాటిని రెగ్యులర్ గా వేసుకోవటం అంత మంచిది కాదు కానీ చాలా మంది ఎత్తు చెప్పులను ఎక్కువ వేసుకోటానికి ఇష్టపడతారు. వాటిని పని చేసే ప్రాంతాలకి వేసుకుని వెళతారు . దీని వల్ల మడమలకు విపరీతమైన నొప్పి వస్తుంది. అందులో ఒక వేళ మీ ఉద్యోగం ఎక్కువ సేపు నుంచోవటం అయితే అది ఇంకా ప్రమాదం. అందుకే మీరు జెల్ ఇన్సోల్‌ లను ఉపయోగించవచ్చు, ఇది చాలా తేడాను కలిగిస్తుంది మీకు సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఎత్తు చెప్పులు కొనుగోలు చేసేటప్పుడు, ఈ చిట్కాలను పాటిస్తే మీరు సౌకర్యవంతంగా ఉంటారు. సో మీ సన్నిహితులకి కూడా ఈ టిప్స్ తెలియచేయండి.

Content above bottom navigation