ఆలయంలో 10 వేల మంది నగ్నంగా పూజలు .. ఈ వింత పండుగ..

170

మనం ఏ గుడికి వెళ్లినా కూడా ఎంతో పవిత్రంగా, మంచి డ్రెస్ వేసుకుని, భక్తితో వెళ్తాము. కానీ ఇప్పుడు నేను చెప్పే ఆలయానికి భక్తులు ఎలా వెళ్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. మీరు ఏదైనా టెంపుల్ కు వెళ్లి దేవుడికి నగ్నంగా పూజలు చేస్తారా.. ఛీఛీ అలా ఎందుకు చేస్తాం, అలా చేస్తే మహాపాపం అని మనం నమ్ముతాం. కానీ, జపాన్‌లోని ఓ ఆలయంలో ఏటా 10 వేల మందికి పైగా భక్తులు నగ్నంగా పూజలు నిర్వహిస్తారు. అలాగైతే స్త్రీలకు ఇబ్బంది కదా అనే కదా మీ డౌట్. ఆ భయమే అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో పాల్గొనే భక్తులంతా పురుషులే. మరి అలా ఎందుకు నగ్నంగా పూజిస్తారు, దాని వెనుక ఉన్న కథ ఏమిటో చూద్దామా.

ఈ క్రింది వీడియోని చూడండి

జపాన్‌లోని ఒకయామా ప్రాంతంలో ఉన్న సాయిదైజి కన్నోనిన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఫిబ్రవరి నెల రాగానే పురుషులంతా ఆలయంలో ఉండే చెక్క దుంగ దర్శనం కోసం పురుషులంతా నగ్నంగా ముస్తాబవుతారు. ఏటా ఫిబ్రవరి 15న రాత్రి 10 గంటలు కాగానే పురుషులంతా ఆలయంలోకి ప్రవేశిస్తారు. వారు అదృష్ట దైవంగా భావించే సుమారు ఐదు శతాబ్దాల నాటి చెక్క దుంగను దర్శిస్తారు. ఈ దుంగను దర్శిస్తే తమకు సంతాన భాగ్యం లభిస్తుందనేది వారి నమ్మకం. ఈ పండుగను హడాకా మట్సూరీ లేదా నగ్న పండుగ అని కూడా పిలుస్తారు. భక్తులు ఈ కార్యక్రమానికి పూర్తిగా నగ్నంగా వెళ్లక్కర్లేదు. అయితే, చాలా తక్కువ మొత్తంలో దుస్తులు ధరించాలి. అందుకని, తెల్లని గోచీలు కట్టుకుని పురుషులు ఆలయంలోకి వస్తారు. ఆలయంలోకి పది వేల మంది పురుషులు ప్రవేశించడానికి మాత్రమే వీలుంటుంది. ఎవరైతే లోపలికి ప్రవేశిస్తారో వారిని అదృష్టవంతులుగా భావిస్తారు.

ప్రార్థనల తర్వాత పూజార్లు 100 కర్ర ముక్కలను భక్తులపైకి విసురుతారు. వీటిని ఎవరైతే పట్టుకుంటారో వారికి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. ఆ కర్రలను అందుకొనే క్రమంలో చాలామందికి గాయాలవుతాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఈ ఏడాది కూడా తొక్కిసలాట జరిగినా.. ప్రాణనష్టం జరగలేదు. గతేడాది జరిగిన తొక్కిసలాటలో పలువురు చనిపోయారు. ఫిబ్రవరి నెలలో అక్కడ తీవ్రమైన చలి ఉంటుంది. ఆ సమయంలోనే పురుషులు నగ్నంగా ఆలయానికి రావల్సి ఉంటుంది. అక్కడ తెల్లని వస్త్రాని మొలకు గోచీలా పెట్టుకుని ఆలయంలో ఉండే రెండు అదృష్ట దుంగులను నమస్కరించి కర్రలను అందుకోవడానికి సిద్ధం కావాలి. అంతేకాదు.. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఆలయం ప్రాంగణంలో పరుగులు పెట్టాలి. ఆ తర్వాత గడ్డకట్టిన చల్లని నీటిలో మునిగి స్నానాలు ఆచరించాలి. ఈ పండుగ సుమారు 500 ఏళ్ల కిందట మురోమాచి కాలంలో ఆరంభమైంది. ఇలాంటి వేడుకే జపాన్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతాయి. చాలా విచిత్రంగా ఉంది కదా ఈ ఆచారం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation