సిద్దిఖీకి వైద్యం చేసిన 10 మందిలో కరోనా లక్షణాలు

122

దేశంలో తొలి కరోనా వైరస్ మరణం నమోదైన విషయం తెలిసిందే. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా సోకి మృతిచెందాడు. మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ ఫిబ్రవరి 29న సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో స్క్రీనింగ్ నిర్వహించగా.. అతడిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేవు. కానీ, మార్చి 5న అతడు ఆస్తమా, బీపీతో కలబుర్గిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేశారు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

హాస్పిటల్ సిబ్బంది అతడి రక్త నమూనాలను కరోనా పరీక్షలకు పంపారు. మూడు రోజుల తర్వాత అతణ్ని హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అదే రోజు అతణ్ని ఇంటికి తీసుకెళ్లగా.. రాత్రి 10.30 గంటలకు మృతిచెందాడు. అతడికి చేసిన పరీక్షల్లో కొరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. సిద్ధిఖీకి వైద్యం అందించిన 10 మంది డాక్టర్లు, నర్సుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించామని కర్ణాటక అధికారులు వెల్లడించారు. ఇక ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తరువాత కలిసిన దాదాపు 50 మందిని గుర్తించి, వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి, పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

Content above bottom navigation