మోడీకి రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చిన ఈ వ్యాపార దిగ్గజం ఎవరో తెలుసా?

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ కోరల నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తుంది. దానికి సెలబ్రిటీస్ కూడా తోడవుతున్నారు. ఎవరికి తోచింది వాళ్లు విరాళంగా ఇస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం మనదేశ సెలెబ్రిటీలు భారీగానే ముందుకు వస్తున్నారు ముఖ్యంగా వ్యాపార రంగం నుంచి చాలామంది ముందుకు వస్తున్నారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

నో డౌట్...! బాబు గారికి మోడీ దగ్గరకు ...

భారత్‌లోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ కోవిడ్-19 కట్టడికి తన వంతు సాయం చేశారు. ప్రధాని మంత్రి సహాయ నిధికి ఆదానీ ఫౌండేషన్ తరపున రూ.100 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వపరంగా కోవిడ్-19కి కట్టడికి తీసుకునే ప్రతీ చర్యకూ తమ వంతు సాయం చేస్తామని, పూర్తి సహకారం ఉంటుందని గౌతమ్ ఆదానీ స్పష్టం చేశారు. ఇప్పటికే తమ సంస్థ తరఫున రూ. 100 కోట్ల రూపాయల విరాళం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థ ప్రకటించింది. తమ కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగి.. తమ ఒక రోజు జీతాన్ని పీఎం సహాయ నిధికి విరాళంగా ఇవ్వడానికి అంగీకరించినట్లు ఆ సంస్థ తెలిపింది.

సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

ఇదిలా ఉంటే.. కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేందుకు చాలామంది వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్టు రూ.500 కోట్ల సహాయక ప్యాకేజీని ప్రకటించాయి. జేఎస్‌డబ్యూ గ్రూప్ రూ.100 కోట్లను ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహేంద్ర గ్రూపు రూ.25కోట్లు, ఆ బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ రూ. 25కోట్లు చొప్పున్న ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. అదనంగా మరో పది కోట్ల రూపాయలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇస్తోంది. ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూయలర్స్ కూడా పది కోట్ల రూపాయల సాయానికి ముందుకొచ్చింది. ఈ లాక్‌డౌన్ సమయంలో స్థానిక ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో నిరుపేదలకు ఆహార, ఇతర నిత్యావసరాలను అందిస్తామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ మార్చి, ఏప్రిల్ నెలల్లో తమ 8 వేల మంది ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తామని ప్రకటించింది. మరోవైపు ఫోర్టీస్ హెల్త్ కేర్ తమ 28 ఆస్పత్రులలో కరోనావైరస్ బాధితుల కోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది.

Content above bottom navigation