105 ఏళ్ల వయసులో ఈ బామ్మ చేసిన పనికి దేశం మొత్తం షాక్ అయింది

చదువుకి వయస్సు తో పనిలేదు. చదువుకోవాలనే తపన ఉంటే చాలు. ఈ మాటలని మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇలా వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది గొప్ప గొప్ప చదువులు చదివారు. ఎన్నో డిగ్రీలు సాధించారు. మంచానికే పరిమితమైన బామ్మలు సైతం కంప్యూటర్లతో, సోషల్ మీడియాతో కుస్తీలు పడుతున్నారు. వారికంటే 105 ఆకులు ఎక్కువ చదివిన 105 ఏళ్ల కేరళ బామ్మ. ఉన్నత స్థానాల్లో నిలిచి, చదువుకి వయస్సు అడ్డు కాదని నిరూపించారు ఈ బామ్మ. ఆమె రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 4వ తరగతి పరీక్షల్లో పాసయ్యింది. దేశంలోనే అత్యధిక వయసున్న విద్యార్థిగా రికార్డుకెక్కిన ఈ బామ్మపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తాను పదో తరగతి పరీక్షలు కూడా రాసి పాస్ అవుతానని ఆమె ధీమాగా చెబుతున్నారు.

Image result for 105 ఏళ్ల బామ్మకు కంగ్రాట్స్ చెప్పండి.. 4వ తరగతి పాసైంది..

కేరళలోని కొల్లం జిల్లాలోని త్రికారువాకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ నాలుగవ తరగతి పరీక్ష రాసి పాసయ్యింది. భగీరథీ బామ్మకు చదువంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడే ఆమెకు కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో ఆమెకు ఇష్టమైన చదువును వదులుకోవాల్సి వచ్చింది. ఆమెకు 9 ఏళ్ల వయసు ఉండాగానే తల్లి చనిపోవడంతో, తోడబుట్టిన తమ్ముళ్లు, చెల్లెళ్ళ బాధ్యతని తీసుకోని, మూడో తరగతిలోనే తన చదువుని ఆపేసి వారికి సేవలు చేసింది. తరువాత ఆ బామ్మ పెళ్లి, పిల్లలు ఇలా అన్ని జరిగిపోయాయి. ఆమెకు ఆరుమంది పిల్లలు, 12 మంది మనవలు, మునిమనమలు ఉన్నారు. వివాహం అయిన వెంటనే ఆమె ముప్పై ఏళ్ళు వచ్చేసరికే భర్తను కోల్పోయింది. భర్త చనిపోయేనాటికి ఆమెకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి బాద్యతలు ఇలా వయస్సు మీద పడింది.

ఈ క్రింది వీడియో చూడండి

9 ఏళ్ల వయసులో చదువు ఆపేసిన చదువుకోవాలనే ఆమె కోరిక మాత్రం తీరలేదు. కానీ మనస్సుంటే మార్గం ఉండకపోదు అన్నట్లుగా తన 105 సంవత్సరాల వయస్సులో నాలుగవ తరగతి పరీక్ష రాసారు భగీరథి అమ్మ. అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ క్రింద ఈ పరీక్షను రాసారు. నాలుగో తరగతి పరీక్షతో తన చదువును తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు ఈ బామ్మ. 105 సంవత్సరాల వయస్సులో కూడా భగీరథి బామ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. చక్కటి కంటిచూపు, వినికిడి శక్తి ఏమాత్రం తగ్గలేదు. ఒక్కసారి ఏ విషయం అయినా విన్నారు అంటే చక్కగా బుర్రలో ప్రింట్ అయిపోయినట్లే. అంతటి జ్నాపకశక్తి ఆమెది. ఇది ఆమె పాఠాలు విన్నప్పుడు చక్కగా ఉపయోగపడింది. కేరళ రాష్ట్రం అక్షరాస్యత మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘అక్షరలక్ష్యం’ ప్రాజెక్ట్‌లో భాగంగా భగీరథి అమ్మ ఈ పరీక్షను రాశారు. భగీరథీ అమ్మ చిన్న కుమార్తె థాంకమణికి ఇప్పుడు 67 ఏళ్ల వయసు. 2018 లో అక్షరాస్యత మిషన్ అక్షర లక్ష్యం అక్షరాస్యత కార్యక్రమంలో 100 కి 98 మార్కులు సాధించిన 96 ఏళ్ల కార్తియని అమ్మ భగీరథి అమ్మ గట్టి పోటీదారు అని నిరూపిస్తోంది. 105 ఏళ్ల వయసులో చదువుకోవడం అంటే నిజంగా గ్రేట్ కదా..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation