జార్జియాలో అనుష్క శెట్టి చేసిన ఘనకార్యం తెలిస్తే షాకే.. కారు డ్రైవర్‌తో

185

2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన ‘సూప‌ర్’ సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శ‌బ్దం’ ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైద‌రాబాద్‌లోఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌లో ప‌లువురు ద‌ర్శ‌కులు పూరి జగన్నాథ్, రాఘవేంద్రరావు, ఎస్ఎస్ రాజమౌళి, వీరుపోట్ల, వైవీఎస్ చౌదరీ, నిర్మాత‌ డి సురేష్, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.నిర్మాత ఎం. శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ, “అనుష్క జీవితాన్ని మార్చేసిన సినిమా ‘అరుంధ‌తి’ అని అంద‌రూ అంటుంటారు కానీ, ఆ సినిమాతో నా జీవితాన్ని మార్చేసిన న‌టి తాను అని నేనంటాను.

అనుష్క దాన గుణం గురించి

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

ఆ మాట‌కు నేను క‌ట్టుబ‌డి ఉంటాను. త‌న స్నేహితుల‌కు ఆమె ఆనందాన్ని క‌లిగిస్తుంది. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడ‌ల్లా ఆమె స్నేహితుల ద‌గ్గ‌ర ఉంటుంది. వాళ్ల బాధ‌లు వింటుంది. వాళ్ల ఆనందాన్నీ, విజ‌యాల్నీ సెల‌బ్రేట్ చేస్తుంది. ఆమె కుడిచేత్తో చేసే సాయం ఎడ‌మ చేతికి కూడా తెలీదు. ఆమె త‌న సొంత‌ కుటుంబాన్ని మొద‌లు పెట్టాల‌ని కోరుకుంటున్నా. ‘నిశ్శ‌బ్దం’ టీమ్‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నా” అన్నారు.అనుష్క చేసే దానాలు, ఇతరులు ఆదుకొనే గుణం గురించి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పి అందర్నీ షాక్ గురిచేశారు. అంతే కాకుండా కారు డ్రైవర్‌తో ఉన్న రిలేషన్‌ గురించి చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల వెకేషన్ కోసం జార్జియాకు వెళ్లాను. అక్కడ నాకు రష్యాకు చెందిన కారు డ్రైవర్ పరిచయం అయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చావంటే హైదరాబాద్ నుంచి అని చెప్పాను. ఏం చేస్తారని అడిగితే సినిమాలు నిర్మిస్తుంటాను చెప్పాను.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

వెంటనే కారు డ్రైవర్ మీకు స్వీటి తెలుసా? అని అడిగారు. స్వీటి అంటే అనుష్కానా అంటే అవును జవాబిచ్చాడు. దాంతో నేను షాక్ గురయ్యాను అని శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు.అనుష్క గురించి మీకు ఎలా తెలుసు అని కారు డ్రైవర్‌ను అడిగితే.. షూటింగ్ కోసం అనుష్క జార్జియాలో మూడు నెలలు ఉన్నారు. అప్పుడు నేను రెండు వారాలు కారు డ్రైవర్‌గా ఉన్నాను. అప్పుడు మా మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది. మూడో వారం వెళ్లకపోతే ఆమె నాగురించి వాకబు చేసింది. నేను మంత్లీ ఇన్స్‌టాల్ మెంట్ కట్టకపోవడం వల్ల లోన్ ఇచ్చిన వాళ్లు కారు తీసుకెళ్లారు. దాంతో నాకు పనిలేకుండా పోయింది. వెంటనే ఆ విషయం తెలుసుకొన్న అనుష్క బాధపడిందని కారు డ్రైవర్ చెప్పారని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు.నా బాధను ఆమె తన బాధగా భావించిన అనుష్క నాకు గొప్ప సహాయం చేసింది. నన్ను తీసుకెళ్లి కారు కొనిచ్చింది. ఈ విషయాన్ని ఎవరికీ కూడా చెప్పలేదు. జార్జియాలో రష్యాకు చెందిన నాకు అంత మొత్తం సహాయం చేయడంతో మా ఫ్యామిలీ హ్యాపీగా ఫీలయ్యింది. అప్పటి నుంచి మా ఫ్యామిలీకి అనుష్క అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకొంటామని కారు డైవర్ చెప్పారు. అనుష్క నాకు తెలుసననే కారణంగా నాకు మంచి బహుమతి కూడా ఇచ్చారు అని శ్యాంప్రసాద్ వెల్లడించడంతో సభ చప్పట్లతో మారుమోగింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation