ఒక్క వ్యక్తి వల్ల 1500 మందికి కరోనా వైరస్?… అసలేం జరుగుతోంది

112

సిక్కు మత గురువు బలదేవ్ సింగ్… కరోనా వైరస్ సోకి మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమధ్య ఇటలీ, జర్మనీకి వెళ్లి తిరిగివచ్చిన గురు బలదేవ్ సింగ్‌ను పోలీసులు క్వారంటైన్‌లో ఉంచారు. ఐతే… ఈ 70 ఏళ్ల బలదేవ్ సింగ్… ఇండియా వచ్చిన తర్వాత… దాదాపు 12 గ్రామాల్లో పర్యటించి… మత బోధనలు చేశారు. ఐతే… బలదేవ్ సింగ్‌ కరోనా పాజిటివ్ వచ్చి చనిపోవడంతో ఆయన తిరిగిన గ్రామాల్ని ఇప్పుడు పూర్తిగా క్వారంటైన్ చేశారు. అక్కడ దాదాపు 1500 మంది జీవిస్తున్నారు. వారందర్నీ హోం క్వారంటైన్ చేసేశారు. మార్చి 18 నుంచీ ఇది కొనసాగుతోంది. ఈ గ్రామాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే చర్యలు తీసుకునేలా… మెడికల్ టీమ్స్ రెడీగా ఉండి… రోజూ పరిశీలిస్తున్నాయి.

Coronavirus: High Blood pressure is major death risk, says top ...
సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

ఇప్పటికే బలదేవ్ సింగ్‌ని కలిసిన… 19 మందికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. మరో 200 మందికి జరిపిన పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. బలదేవ్ సింగ్ ఇద్దరు శిష్యులకూ కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడీ అంశం ఇండియాను కుదిపేస్తోంది. కెనడాలో ఉంటున్న పంజాబీ సింగర్ సిద్ధు మూస్ వాలా… దీనిపై ఓ సాంగ్ పాడి యూట్యూబ్‌లో పెట్టగా… దాన్ని రెండ్రోజుల్లో 27 లక్షల మంది చూశారు. నేను మరణమనే నీడలా గ్రామాల్లో తిరిగి… కరోనా వైరస్‌ని వ్యాపింపజేశాను అనే లిరిక్స్‌తో ఇది ఉంది. ఈ సాంగ్ ప్రజలంతా చూడాలని పోలీసులు కోరారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 900 దాటినట్లు తెలుస్తోంది. అలాగే మృతుల సంఖ్య 21కి చేరినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. పంజాబ్‌లో 38 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితుల్లో బలదేవ్ సింగ్ వల్ల ఎంత మందికి కరోనా వచ్చి ఉంటుందో అనే ఆందోళన ఉంది.

Content above bottom navigation