2020 డిసెంబర్ లో యుగాంతం? వంగ బాబా చెప్పిన సంచలన విషయాలు

యుగాంతం.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యుగాంతంపై ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. 2012 లో యుగాంతం అని అప్పట్లో పెద్ద వార్తలే వచ్చాయి. ఏకంగా ఒక సినిమానే వచ్చింది. కానీ యుగాంతం కాదు కదా, ఏ దేశానికి కూడా చిన్న ప్రమాదం కూడా జరగలేదు. అయినా కూడా అప్పటినుంచి అదిగో యుగాంతం, ఇదిగో యుగాంతం అని వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని నమ్మేవాళ్ళు నమ్ముతూనే ఉన్నారు. నమ్మే వారు ఉండాలి కానీ రేపే యుగాంతం అని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ యుగాంతం గురించి ఓ వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for వంగ బాబా

వంగ బాబా చెప్పిన మాటలు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఆ మాటలు ఇప్పుడవి కాదు ఎప్పుడో 50 ఏళ్ళ మాటలు.. అప్పుడు ఆమె చెప్పింది.. ఇప్పుడు అది జరుగుతుంది. ఆమె అసలు పేరు వంగోలియా పాండేవ్ దిమిత్రోవా. ఆమె 1911లో పుట్టారు. 1966 లో చనిపోయారు. అయితే ఆమె 12వ ఏటా ఆమె కంటి చూపు పోయింది. దీంతో ఆమె అప్పుడు పర్వతాల వద్దకు వెళ్లి అంతర్గత శక్తులను చైతన్య పరచుకున్నారు. దాని ఫలితంగా ఆమెకు భవిష్యత్తును ముందే ఊహించే శక్తి వచ్చింది. ఆమె భవిష్యత్తు గురించి ఎన్నో చెప్పారు.. అన్ని ఒకటికి ఒకటి జరుగుతూ వచ్చాయి. అయితే ఆమె 54 ఏళ్ళ కిందటే 2020లో డిసెంబర్ 10వ తేదీన యుగాంతం వస్తుంది అని చెప్పి ఆమె మరణించారట. ఆమె చెప్పిన సమయానికి ఇంకా కేవలం 10 నెలలు మాత్రమే ఉంది. అయితే యుగాంతం రావడానికి ముందు ఏం జరుగుతుందో కూడా ఆమె చెప్పారు. ఆమె చెప్పినట్టే ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. యుగాంతానికి ముందు అమెరికాలో యుద్ధ వాతావరణం సంభవిస్తుంది అని, ఆ తర్వాత చైనా నగరాల్లో ఓ పెద్ద వైరస్ పుడుతుంది అని, ఆ వైరస్ కారణంగా కొన్ని వేల మంది మరణిస్తారు అని, అలాగే ప్రపంచంలో లేని పోనీ సమస్యలు వస్తాయి అని, ప్రపంచంలో మానవత్వం కరువై, మనిషి మరణించిన శవాన్ని కూడా ముట్టుకోరు అని, ఎంతోమంది ప్రజలు ఆకలితో మరణిస్తారు అని, పెట్రోల్ వాడకం తగ్గుతుంది అని, ఎలక్ట్రిక్ వాడకం పెరుగుతుంది అని, స్త్రీలకు భద్రత ఉండదని, మానభంగాలు హత్యలు పెరుగుతాయి అని, 2020లో మతపరమైన కల్లోలాలు చెలరేగుతాయి అని ఆమె 55 ఏళ్ళ క్రితమే చెప్పారు.

Image result for వంగ బాబా

ఆమె చెప్పినట్టు ఇప్పటికే అన్ని జరిగిపోయాయి. దాదాపు 90 శాతం ఇప్పటికే జరిగాయి.. ఇప్పుడు పైన చెప్పినవి అన్ని ఈ సంవత్సరం మొదటి రోజు నుండి జరిగినవే. అంటే దీన్ని బట్టి చూస్తే ఇంకా మనిషి జీవితానికి కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉంది అనేది తెలుస్తుంది. అయితే నోస్ట్రడామస్ లాగా వంగ బాబా ప్రపంచం అంతమైపోతుందని చెప్పలేదు గానీ, అల్లకల్లోలం అవుతుందని మాత్రం చెప్పారు. ఆమె చెప్పింది మనం నమ్మాలా అంటూ చాలా మంది పరిశోధకులు… ఆమె ఏం చెప్పారు? వాటిలో ఎన్ని జరిగాయి? అన్నీ లెక్కలేశారు. చివరకు ఆమె చెప్పిన వాటిలో 80 శాతం కరెక్టుగా జరిగాయని తేల్చారు. సో 2020 లో మనం జాగ్రత్తగా ఉంటూ మానవత్వంతో మెలిగితే అందరికీ మంచిది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation