2050 లో బెంగుళూర్ సిటీ ఎలా ఉండబోతుంది..

57

బెంగుళూర్ ను సిలికాన్ సిటీ అఫ్ ఇండియా అని అంటారు. ఇది చాలా అందమైనా నగరం. ఇండియాలోనే పెద్ద IT హబ్ గా బెంగుళూర్ ను చెప్పుకోవచ్చు. కాలంతో పాటు బెంగుళూర్ చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే డెవలప్ అవుతున్న సిటీలలో బెంగుళూర్ టాప్ 10 లో ఉంది. ఇప్పుడే ఇలా ఉంటె భవిష్యత్ లో బెంగుళూర్ ఎలా ఉండబోతుంది. ఫ్యూచర్ లో ఇది మన ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చెయ్యబోతుందా? వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెంగుళూర్ జనాభా 12.4 మిలియన్స్. ఈ లెక్కన చుస్తే 2050 వరకు 13.5 మిలియన్ వరకు చేరుకుంటుంది. బెంగుళూర్ విస్తీర్ణం 709 స్క్వేర్ కిమీ. ఇండియా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అతిపెద్ద నగరం బెంగుళూర్. బెంగుళూర్ జీడీపీ 83 బిలియన్ డాలర్స్. బెంగుళూర్ లో 7700 మిలినియర్స్, 33 బిలినియర్స్ ఉన్నారు. వీళ్ళ ఆదాయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 2050 వరకు బెంగుళూర్ ఆర్థికంగా ఇంకా బలపడబోతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ అండర్ కంస్ట్రక్షన్ లో ఉన్నాయి. వీటిని తొందరగా పూర్తీ చేసే పనిలో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్స్ ఏమిటో ఇప్పడూ చూద్దాం.

 • బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ సెకండ్ రన్ వే….
  బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో సెకండ్ రన్ వే నిర్మించబోతున్నారు. ఒకవేళ అది నిర్మిస్తే ఇండియాలోనే రెండు రన్ వే ల ఎయిర్ పోర్ట్ ఉన్న ఫస్ట్ సిటీగా బెంగుళూర్ పేరు సంపాదించుకోబోతుంది. ఈ రన్ వే ఎలాంటి విమానాన్ని అయినా పార్క్ చెయ్యగల సామర్థాన్ని కలిగి ఉంటుంది. దానితో పాటు 165 ఎయిర్ క్రాఫ్ట్స్ పార్కింగ్ చేసుకునే సదుపాయం కలిగి ఉంటుంది. అలాగే అక్కడ 48 వేల మంది వర్కర్స్ ఉపాధి పొందుతారు. అలా సెకండ్ రన్ వే ను నిర్మించడానికి 13 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.
 • పోర్ట్ టాక్సీ…
  బెంగుళూర్ లో రాబోతున్న కొత్త ట్రాన్స్ పోర్ట్ సిస్టమే పోర్ట్ టాక్సీ. దీని ప్రయాణం ఫాస్ట్ అండ్ సింపుల్. ఒకేసారి ఒక్క పోర్ట్ టాక్సీలో 6 మంది ప్రయాణం చెయ్యవచ్చు. వీటి వేగం గంటకు 60 కిమీ. ఇవి నడిచేందుకు 70 కిమీ రూట్ ను తయారుచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విలువ 1,445 కోట్లు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. దాంతో పాటు ఇంధనం యూసేజ్ కూడా తగ్గుతుంది.
 • పెరిఫెరల్ రింగ్ రోడ్డు…
  ఈ ప్రాజెక్ట్ ను 65 కిమీ నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఫ్లై ఓవర్లు, రైల్వే బ్రిడ్జ్ లు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 17000 కోట్లు ఖర్చు అవ్వనుంది.
 • హోక్లిపురం కారిడార్..
  ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 353 కోట్లు ఖర్చు అవుతుంది.
 • బెంగుళూర్ మెట్రో ఫేజ్ 2…
  బెంగుళూర్ మెట్రో సిస్టమ్ ఇండియాలోనే నెంబర్ 2 లార్జెస్ట్ మెట్రో సిస్టమ్. బెంగుళూర్ మెట్రో 42 కిమీ వ్యాపించి ఉంది. ఈ మెట్రో 41 స్టేషన్స్ ను కవర్ చేస్తుంది. ఇక ఫేజ్ 2 కనుక పూర్తీ అయితే మొత్తం 72 కిమీ అవుతుంది. అలాగే 61 స్టేషన్స్ నిర్మించాలని ప్లాన్ వేశారు. ఇందులో 12 స్టేషన్స్ పూర్తీగా అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి.
Image result for bangalore

ఇక బెంగుళూర్ లో ఉన్న బిల్డింగ్స్ గురించి మాట్లాడుకున్నటైతే.. ఒక్కొక్క బిల్డింగ్ 50 మీటర్లు వరకు ఉంటాయి. 50 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న బిల్డింగ్ లు 100 వరకు ఉంటాయి. బెంగుళూర్ లో టాలెస్ట్ బిల్డింగ్ మంత్రి పినాకిల్. దీని ఎత్తు 153 మీటర్లు. అలాగే 315 మీటర్లు కంటే ఎక్కువ ఉండే బిల్డింగ్ లో కంస్ట్రక్షన్ లో ఉన్నాయి. అలా చాలా ఎత్తులో బిల్డింగ్ లో నిర్మించబోతున్నారు. వీటిలో పాటు 8 వేల కోట్ల ఖర్చుతో నయా బెంగుళూర్ క్రియా యోజన అనే పథకాన్ని స్టార్ట్ చెయ్యనున్నారు. దానిలో భాగంగా ట్రాఫిక్ సిస్టమ్, ఆంటీ ఫ్రోడ్ ప్లాన్ లాంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. అలా బెంగుళూర్ పారిశ్రామికంగా, సేవా రంగాలలో మరింత ముందుకు దూసుకుపోనుంది.

ఇక పర్యావరణం గురించి చూసినట్లయితే… బెంగుళూర్ ను ద గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ పచ్చదనం ఎక్కువ. చెట్లతో నిండిన పార్క్ లు అనేకం ఉంటాయి. ఒకప్పుడు బెంగుళూర్ వాతావరణం సూపర్ గా ఉండేది కానీ, ఇప్పుడు వాతావరణం కలుషితం అవుతుంది. వాటిలో భాగంగానే ఎయిర్ పొల్యూషన్, ట్రాఫిక్ కంజేషన్, వాటర్ స్కార్ సిటీ, డిసిపియరింగ్ లేక్స్ లాంటి సమస్యలు వస్తున్నాయి. దానితో పాటు టెంపరేచర్ పెరిగిపోతుంది. ఇవన్నీ ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ చెయ్యవచు. వాహనాల వల్లనే 60 నుంచి 70 % కలుషితం అవుతుంది. కొన్ని పద్ధతులతో వీటిని ఈజీగా అరికట్టవచ్చు. వీటి కోసమే కొత్త కొత్త వాహన చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. చెట్లను ఎక్కువగా పెంచడం వలన వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. కర్ణాటకలో 80 శాతం ఇన్కమ్ కేవలం బెంగుళూర్ నుంచే వస్తుంది. కర్నాటకంలో 98% సాఫ్ట్ వేర్ కేవలం బెంగుళూర్ లోనే ఉంది. కర్ణాటక అండ్ ఇండియా గవర్నమెంట్ కలిసి 2050 వరకు ఇండియాలోనే అతిపెద్ద ఐటి హబ్ గా చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇది జరిగితే బెంగుళూర్ 2050 వరకు ఇండియాలోనే అతిపెద్ద నగరంగా మారుతుంది.

Content above bottom navigation