తాను చనిపోతూ 23 మందికి కరోనా అంటించాడు ఎక్కడో తెలిస్తే వణికిపోతారు

146

గతేడాది డిసెంంబరులో చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించింది. దీని వల్ల ఇప్పటికే 24వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 150కిపైగా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలోనే చైనా మరింత పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఈ దుస్థితి వచ్చుండేదికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా దెబ్బలు లాక్ డౌన్ ను ప్రకటించాయి.. భారత్ గత వారం రోజులుగా లాక్ డౌన్ లోనే ఉంది.

సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

World Health Organization names the new coronavirus: COVID-19

ఈ విషయం పక్కన పెడితే.. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు, విదేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో, క్వారంటై‌‌న్‌‌లో ఉండేవారు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా రోడ్లపై ఇష్టారీతిన రోడ్లపై తిరుగుతుండటంతో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నారు. వీరు తమ ప్రాణాలతో పాటు తోటి వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టిస్తున్నారు. తమకు కరోనా సోకిందన్న విషయాన్ని దాచిపెడుతూ.. సన్నిహితులకు, కుటుంబసభ్యులకు ఈ వైరస్ సోకింపజేస్తున్నారు. దీంతో ఆరోగ్యవంతులైన కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు. పంజాబ్‌లో జరిగిన ఈ ఉదంతమే నిదర్శనం. కొద్దిరోజుల క్రితం ఓ 70 ఏళ్ల పంజాబ్ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి, కరోనాతో అట్టుడుకుతున్న ఇటలీ, జర్మనీ దేశాల్లో రెండు వారాల పాటు పర్యటించి భారతదేశంలోకి అడుగుపెట్టాడు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి. పక్కవారి ఆరోగ్యం ఏమైతే నాకేంటి అన్నట్టు భారత్‌కు వచ్చినప్పటి నుంచి సుమారు 100 మందిని కలిసి, 15 గ్రామాలను సందర్శించి ఈ నెల 18న ఆసుపత్రిలో మరణించాడు. ఇతను చనిపోతూ మరో 23 మందికి కరోనా వైరస్ ను అంటించాడని సమాచారం.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

చనిపోయిన వ్యక్తి భగత్ సింగ్ నగర్ జిల్లాలోని నవాన్ షహర్ కు చెందిన బల్ దేవ్ సింగ్. ఆయనో సిక్కు మత ప్రబోధకుడు. వయసు 70 సంవత్సరాలు. తన స్నేహితులతో కలిసి ఇటీవలే జర్మనీ, ఇటలీ దేశాల్లో పర్యటించాడు. భారత్ చేరుకోగానే అతడికి స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు ఇంటి దగ్గరే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అయితే బల్ దేవ్ సింగ్ అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా 15 గ్రామాల్లో తిరగడంతో పాటు.. దాదాపు 100 మందిని కలిశాడని తెలిసింది. ఆ తర్వాత అతనికి కరోనా ముదరడంతో ఈ నెల 18న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అంతేకాదు ఇప్పుడు ఆయన కుటుంబంలో ఏకంగా 14 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందట. పంజాబ్ లో 33 కరోనా కేసులు ఉంటే… వాటిలో 23 కేసులు ఈ వ్యక్తి ద్వారానే వ్యాప్తి చెందినట్టు గుర్తించారట అధికారులు. మరణించిన వ్యక్తి సందర్శించిన 15 గ్రామాలను సీల్ చేసి, 23 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈయనతో కాంటాక్ట్‌లో ఉన్న సుమారు 100 మంది ఎవరా అన్న దానిపై ఆరా తీస్తున్నారు.

Content above bottom navigation