2424 ఏడాది ప్రారంభమయ్యే కొత్తశకాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని పాలించేది ఈ హిమాలయ దేశమే

166

హిందువులు భక్తితో పూజించే విష్ణుమూర్తి వివిధ సమయాలలో ధర్మరక్షణకై 9 అవతారాలనెత్తి అసురులను వధించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కలియుగంలో పెరిగిపోతున్న పాపాలను అంతమొందించి, ధర్మసంస్థాపన చేయటానికి శ్రీ మహా విష్ణువు కల్కి అవతారంలో వస్తాడని విష్ణు పురాణం చెబుతుంది. ఆయన జన్మించే స్థలం అత్యంత పవిత్రమైనదై ఉండాలి కాబట్టి హిమాలయాలలో ఒక నగరం ప్రపంచానికి కనపడకుండా రహస్యంగా ఉందని, అందులో మహాపురుషులు, యోగులు, ఋషులు, దేవతలూ సంచరిస్తారని, వారికి ఎన్నో అమోఘమైన శక్తులు ఉంటాయని విష్ణు పురాణంలో వివరించబడింది. ఈ నగరం జాడ గురించి ఎన్నో ఏళ్లుగా, ఎంతో మంది ప్రయత్నించారు. ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ నగరానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శంభల…ఈ పేరును చాలా తక్కువమందే విని ఉంటారు. కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న హిమాలయాల్లో మానవుడు చేరుకోలేని ఎన్నో ప్రాంతాలలో ఈ శంభల ప్రాంతం ఒకటి. హిందూ పురాణాల్లోనే కాకుండా బౌద్ధ గ్రంధాల్లో కూడా ఈ శంభల రాజ్యానికి సంబంధించి వివరంగా రాసారు. ఇక్కడికి చేరుకోవాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో దృడంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈ దేశం కనిపించదు. అతి పవిత్రమైన ఈ దేశం కేవలం ధార్మిక విలువలు ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. అటువంటి ధార్మిక ఆలోచనలు ఉన్నవారికి మాత్రమే ఈ పవిత్ర దేశంలోకి ప్రవేశం కూడా. ఈ నగరం వయస్సు దాదాపు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడ ప్రజలు సుమారు 12 నుంచి 14 అడుగుల పొడవైన ఆజానుబాహువులు. మిక్కిలి బలవంతులు. హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడిన వ్యవహారం. ఈ నగరానికి సంబంధించి ఇతర దేశాల వారు ఎన్నో పరిశోధనలు చేశారు. అందులో ముఖ్యమైనది రష్యా దేశీయులు క్రీస్తుశకం 1920లో జరిపిన పరిశోధనలు.

అయితే ఈ పరిశోధనల్లో ఆ దేశానికి చెందిన కొంతమంది మిలటరీ, ఆధ్యాత్మిక వేత్తలు శంభల దేశానికి చేరుకోకపోయినా ఇందుకు సంబంధించిన స్పష్టత మాత్రం కొంతమంది యోగుల నుంచి తెలుసుకొన్నారు. దీంతో తాము ఆ ప్రాంతానికి ఇప్పట్లో చేరుకోలేమని తెలుసుకొని వెనుతిరిగారు. ఆ తర్వాత ఈ బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి హిట్లర్ ను కలుసుకొని అక్కడికి చేరుకోవడం అసాధ్యమని చెప్పినట్లు రికార్డులు చెబుతున్నాయి. బౌద్ధ గ్రాంధాల్లోని వివరాలను అనుసరించి ప్రస్తుత భూ మండలం పై పాపం పెరిగిపోయి అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో ఈ శంభల దేశంలోని పుణ్యపురుషులు విశ్వపాలనను తమ చేతుల్లోకి తీసుకొంటారు. అప్పటి నుంచి భారత దేశంలో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఆ శకం ప్రస్తుత కాలమాన ప్రకారం క్రీస్తు శకం 2424. ఈ విషయాలన్నీ కాలచక్రలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన మరికొన్ని రహస్యాలు బయటికి రావడం లేదు. ఇక హిందూ పురాణాలు కూడా ఈ శంభల దేశంలోనే కల్కీ భగవానుడు ఉద్భవిస్తాడని చెబుతోంది. ఆ తర్వాత ఈ విశ్వం పై దండెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేపడుతారని అనేక పురాణాలు చెబుతున్నాయి.

ఇలా శంభల ప్రాంతానికి సంబంధించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ శంభల దేశానికి సంబంధించిన ఇంకొక విషయం ప్రచారంలో ఉంది. దీనిని అనుసరించి ఫ్రాన్స్ కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ తన 56 ఏళ్ల వయస్సులో టిబెట్ వచ్చారు. అక్కడ కొంతమంది బౌద్ధ సన్యాసులను కలుసుకొన్నారు. వారి ద్వారా శంభల వెళ్లి అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాలు తీసుకున్నరని చెబుతారు. అందువల్లే ఆమె 101 ఏళ్లు పూర్తి ఆరోగ్యంతో బతికారని చెబుతారు. ఒక్క రష్యానే కాకుండా అనేక దేశాల వారు ఈ శంబల దేశం కోసం అనేక పరిశోధనలు చేశారు. ఇంకా చేస్తున్నారు. కానీ ఈ శంబళ గురించి మాత్రం పూర్తీగా కనుక్కోలేకపోతున్నారు. ఎప్పటికి కనుక్కుంటారో చూడాలి.

Content above bottom navigation