ఇండియాలో 30 కోట్ల మందికి

119

న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే 30 కోట్ల మంది కొవిడ్‌ బారిన పడతారని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ(సీడీడీఈపీ) డైరెక్టర్‌ రమణన్‌ లక్ష్మీనారాయణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంఖ్యను 20 కోట్లకు తగ్గించవచ్చన్నారు. అమెరికా, బ్రిటన్‌లో వైరస్‌ వ్యాప్తిని భారతదేశ పరిస్థితులకు అన్వయించి ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

భారతీయుల్లో ఏటా కొన్ని కోట్ల మంది ఫ్లూ బారిన పడతారని, కానీ కరోనా వైరస్‌ కొత్తదని చెప్పారు. ఈ వైర్‌సకు సంబంధించి రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) చాలా తక్కువని, అందుకే అది అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ఈ 30 కోట్లలో మూడో వంతు కేసులు తీవ్రంగా మారే అవకాశం ఉందన్నారు. ముందు జాగ్రత్తలు చేపడితే ఇది నెమ్మదిగా వ్యాపించి, వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని, లేకుంటే స్వల్ప వ్యవధిలో లక్షల మందికి సోకి, 25 లక్షల మంది దాకా మృత్యువాత పడొచ్చని హెచ్చరించారు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

Content above bottom navigation