3000 మంది చ‌నిపోయిన వుహాన్ న‌గ‌రం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా చూస్తే క‌ళ్లుచెమ్మ‌గిల్లుతాయి

124

ఊహ‌కి అంద‌ని ప‌రిస్దితి చైనాలో ఉంది
ఇసుకేస్తే రాల‌ని జ‌నం మ‌నం స‌భ‌ల్లో చూస్తాం… కాని చైనాలో షాపింగ్ మాల్స్ రోడ్ల‌పై కూడా అంత మంది జ‌నం ఉంటారు.
ఎందుకు అంటే ప్ర‌పంచానికి జ‌నాభాని ఎలా పెంచాలో తెలిపిన దేశం చైనా..
అలాంటి చైనా క‌రోనా అనే మ‌హ‌మ్మారికి వ‌ణికిపోతోంది.
కాలు బ‌య‌ట‌పెడితే ఎక్క‌డ వైర‌స్ అంటుతుందా అని, ఇంటిలో నాలుగు గోడ‌ల‌కి 80 కోట్ల మంది ప‌రిమితం అయ్యారు
చూశారుగా ఆ వైర‌స్ ఎలా వారిని వ‌ణికించిందో . ఇక్క‌డ నుంచి 80 దేశాల‌కు ఈ వైర‌స్ ట్రావెల్ చేసింది.
ఇప్పుడు వుహాన్ న‌గ‌రం ఎలా ఉంది సోష‌ల్ మీడియాలో ఆ న‌గ‌రం గురించి ఏమంటున్నారు చూద్దాం.

ఎన్నో మాటల్లో చెప్పలేని భావాల్ని ఒక్క ఫోటోతో చెప్పేయొచ్చు. ఇవాల్టి రోజున నిత్యం కోట్లాది ఫోటోలు తీసినా.. కొన్ని మాత్రమే ప్రపంచాన్ని కదిలిస్తుంటాయి. అలాంటివి ఈ నెల‌లో చైనాలో కొన్ని వంద‌ల ఫోటోలు క‌నిపించాయి. వందలాది మంది ఇప్పటికే వూహాన్ నగరంలో కరోనా బారిన పడి మరణించటం తెలిసిందే. దీంతో.. ఈ మాయదారి పిశాచి వైరస్ అంతు చూసేందుకు చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇలాంటివేళ.. ఏ నిమిషాన.. ఎటువైపు నుంచి వైరస్ విరుచుకుపడిపోతుందన్న భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దుస్థితి.

ఇలాంటివేళ.. నిర్మానుష్యంగా మారిన వూహాన్ లోని ఒక ఆసుపత్రి బయట.. స్ట్రెచర్ మీద ఒక వయసుడిగిన వ్యక్తి సూర్యోదయాన్ని అలా చూస్తుండి పోతుంటే.. అతడి పక్కనే వైద్యుడు వెలుగులు జిమ్ముతున్న సూరీడ్ని చూస్తుండిపోయాడు. 87 ఏళ్ల పెద్దాయనకు గత నెలలో కరోనా లక్షణాలతో ఆసుపత్రి లో చేరాడు. పరీక్షలు నిర్వహిస్తే.. పాజిటివ్ అని తేలింది. దీంతో.. అతడ్నిహాస్పిటల్ లోనూ బందీగా ఉంచి.. చికిత్స చేస్తున్నారు. అతడికి సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యుడు తీసుకెళుతూ.. ఏదో తట్టినట్లు గా ఆగాడు.

Image result for china uhan city

స్టెచర్ లో నీరసించి పోయిన సదరు రోగిని.. సూర్యోదయం చూస్తావా? అని అడగటం.. అతను ఓకే చెప్పటం తో అతన్ని అలా బయటకు తీసుకొచ్చాడా వైద్యుడు. ఆసుపత్రి బయట.. నిర్మానుష్యం గా మారిన పరిసరాల్లో వారిద్దరూ వెలుగులు జిమ్ముతున్న సూరీడు వంక చూస్తుండి పోయారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరిని గమనించిన ఒక వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Image result for china uhan city

ఈ ఫోటో కాస్తా వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోటోను పలువురు స్పందిస్తున్నారు. అతని జీవితం ఆస్తమించకూడదని.. సూర్యోదయంలా వెలుగులు జిమ్మాలని.. అతను పూర్ణాయువుగా నిలవాలని కోరుకుంటున్నారు..వుహాన్
న‌గ‌రంలో దాదాపు కోటి మంది ఉంటారు, కాని ఇప్పుడు రోడ్లుపై ప‌దుల సంఖ్య‌లోనే జ‌నం తిరుగుతున్నారు, పేప‌ర్లు ఇంటికి వేసేవారు కూడా నెల రోజుల నుంచి పేప‌ర్ తీసుకురావ‌డం లేదు…

ఇక స్కూళ్లు కాలేజీలు హ‌స్ప‌ట‌ల్స్ ఏమీ ప‌ని చేయ‌డం లేదు…. నెల రోజుల నుంచి దాదాపు 3000 షాపింగ్ మాల్స్ క్లోజ్ లో ఉన్నాయి, టాయ్స్ బిజినెస్ ఇక్క‌డ రోజూ వందల కోట్ల వ్యాపారం.. కాని కోటి రూపాయ‌ల వ్యాపారం కూడా లేదు, అయితే ఒక‌రి నుంచి ఒక‌రికి ఇక్క‌డే దాదాపు 2000 మందికి వైర‌స్ సోకింది.. ఆ భ‌యం ఇంకా ఆ ప్ర‌జ‌ల్లో ఉంది, ఇక్కడ‌ నుంచి మ‌ల్టీ లేయ‌ర్ ప్రొడ‌క్స్ కంపెనీలు చాలా ద‌గ్గ‌ర …అక్క‌డ ప‌ని చేయ‌డానికి కూడా జ‌నం ఎవ్వ‌రూ వెళ్ల‌డం లేదు.. కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ప‌రిశ్ర‌మ‌లు ప‌నిచేస్తున్నాయ‌ట‌, ఇది వుహ‌న్ ప‌రిస్దితి. దాదాపు వుహాన్ వ‌ల్ల చైనాలో 2 ల‌క్ష‌ల కోట్ల వ్యాపార‌న‌ష్టం వచ్చిందట‌. చైనా ఎప్పుడు కోలుకుంటుంది, ఎప్పుడు అక్క‌డ నుంచి ప‌రిశ్ర‌మ‌లు ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేసి వ‌స్తువులు పంపిస్తాయి అని ల‌క్ష‌లాది మంది వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.

Content above bottom navigation