శివజ్యోతి కొత్త ఇంటి గృహప్రవేశం.. బిగ్ బాస్ బ్యాచ్ రచ్చ రచ్చ.. ఇంటి ఖరీదు తెలిస్తే షాక్..

150

బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 సంగతి పక్కనపెడితే.. సీజన్ 3 కంటెస్టెంట్స్‌కి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. సీజన్ 1, 2లలో చేసిన కంటెస్టెంట్స్ కనుమరుగు కాగా, సీజన్ 3లో చేసిన కంటెస్టెంట్స్‌ పాపులారిటీతో పాటు ఆర్ధికంగా బలపడుతున్నారు. ఒక్కొక్కరుగా సొంతంగా ఇళ్లు కొనుక్కుంటూ సొంతింటి వారవుతున్నారు. ఇప్పుడు మరొక కంటిస్టెంట్ తన సొంతింటి కలను నిజం చేసుకుంది. తీన్మార్ సావిత్రిగా… బిగ్ బాస్ శివజ్యోతిగా తెలుగు ప్రేక్షకులను తెలంగాణ యాసతో ఆకట్టుకుని మంత్రముగ్ధుల్ని చేసిన జ్యోతక్క తన సొంతింటి కలను ఎట్టకేలకు సాకారం చేసుకుంది. ప్రేమించి పెద్దల్ని ఎదరించి పెళ్లి చేసుకున్న జ్యోతక్క.. తన భర్త గంగూలీతో కలిసి ఓ ఖరీదైన ఇంటికి యజమాని అయ్యింది. హైదరాబాద్‌లో మంగళవారం నాడు తన తన కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకను వైభవంగా నిర్వహించింది శివజ్యోతి. దానికి సంబందించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వీ6 తీన్మార్ వార్తలతో పాపులర్ యాంకర్‌ గా పేరు సంపాదించిన తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి.. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా ఫుల్ పాపులర్ అయ్యింది. సుమారు 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఫైనల్ కంటెస్టెంట్స్ గట్టి పోటీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ ముగిసిన తరువాత ప్రస్తుతం టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్‌ తో తన యాస భాషలతో సత్తా చాటుతున్న శివజ్యోతి తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. తన భర్త గంగూలీతో కలిసి హైదరాబాద్ సిటీలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ఈ ఇంటి విలువ దాదాపు కోటిన్నర అని సమాచారం. మంగళవారం నాడు తన కొత్త ఇంటికి గృహప్రవేశం చేసింది శివజ్యోతి. ఈ గృహ ప్రవేశ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ ని ఆహ్వానించడంతో, ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో తెలియజేసింది బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ. ఈ సందర్భంగా హిమజ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది. శివజ్యోతి గృహప్రవేశ వేడుకలో హిమజతో పాటు జోతక్క తమ్ముళ్లు రవిక్రిష్ణ, అలీ రెజాలతో పాటు వితిక, వరుణ్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ లు హాజరయ్యారు. ఈ వేడుకలో అలీ, రాహుల్‌లతో కలిపి సందడి చేసింది హిమజ.

Image result for శివజ్యోతి కొత్త ఇంటి గృహప్రవేశం.

నిజానికి బిగ్ బాస్ హౌస్‌ లో ఉన్నప్పుడు రాహుల్, అలీ, వితికా, వరుణ్ లతో హిమజకు అస్సలు పడేది కాదు. అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి వరుణ్, వితికాలు ఎలిమినేట్ కావడానికి శివజ్యోతి ప్రధాన కారణం. టాస్క్‌లో భాగంగా వరుణ్, వితికాకు సపోర్ట్ చేస్తున్నాడని విభేదించి ఆ వారం ఇంటి సభ్యులందరి ఎలిమినేషన్‌ కి కారణం అయ్యింది శివజ్యోతి. అదే వారంలో నామినేషన్‌ లోకి వెళ్లిన వితికా ఎలిమినేట్ కాగా తరువాత వరుణ్ ఇంటి ముఖం పట్టాడు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో వరుణ్, వితికాలతో గొడవకు దిగింది శివజ్యోతి. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా వరుణ్, వితికాలపై హాట్ కామెంట్స్ చేసింది శివజ్యోతి. వాటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా ఆమె గృహప్రవేశ వేడుకలో పాల్గొని సందడి చేశారు వరుణ్ – వితికాల జంట. ఇంట్లో ఉన్నన్ని రోజులు వీళ్ళ మధ్య గొడవలు బాగానే జరిగాయి. బిగ్ బాస్ తరువాత వీరంతా ఫ్రెండ్స్ అయ్యారు.

Content above bottom navigation