వయసు 38… 20వసారి గర్భం… త్వరలో 17వ డెలివరీ..

2079

మాతృత్వమనేది మహిళలకు వరం అని అంటుంటారు. మన తాతల కాలంలో ఒక్కో మహిళ 5-10 మంది సంతానాన్ని కలిగి ఉండేవారు. ఆ రోజుల్లో అది చాలా సాధారణం. ఇప్పుడు జనరేషన్ మారింది.. ప్రతీ జంట ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే ప్రాధాన్యతనిస్తోంది. పాత కాలంలో లాగా.. ఈరోజుల్లో ఒక్కో ఇంట్లో ఐదుగురు,ఆపై సంతానం ఉండటం చాలా అరుదు. అయితే ముంబైకి చెందిన ఓ మహిళ మాత్రం 20 వసారి బిడ్డకు జన్మనివ్వనుంది. మరి ఆ మహిళ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for pregnancy

మహారాష్ట్రలోని గిరిజన తెగకు చెందిన ఆ మహిళ వయసు 38 ఏళ్లు కాగా, ఇప్పటి వరకు 19సార్లు గర్భం దాల్చి, 16 మంది బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె 20వసారి గర్భం దాల్చింది. అంతేకాదు, అన్ని ప్రసవాలు ఇంట్లోనే జరగడం విశేషం. బీడ్ జిల్లా మజల్‌గావ్ పరిధిలోని కేశపురికి చెందిన సంచార గోపాల్ సామాజిక వర్గానికి చెందిన లంకాయబాయి ఖరత్ (38) 20వసారి గర్భవతి అయినట్టు గుర్తించిన స్థానిక వైద్యులు అవాక్కయ్యారు. అయితే ఈసారి ఆమెను ఇంట్లో కాకుండా హాస్పిటల్ లో ప్రసవం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆమె ఇంతకముందు ఉన్నంత ఆరోగ్యంగా లేదు. అందుకే తొలిసారి ఆమెకు ఆస్పత్రిలో ప్రసవం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఏడో నెల గర్భవతి అయిన లంకాబాయికి గతంలో మూడుసార్లు గర్భస్రావమైంది. కాన్పుకు ఒక్కరు చొప్పున జన్మించగా, ఐదుగురు శిశువులు పుట్టిన కొద్ది రోజుల్లో చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు 11 మంది పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్నీ బీడ్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ థోరట్ వెల్లడించారు. లంకాబాయి గురించి తెలియడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చి, అవసరమైన పరీక్షలను వైద్యులు నిర్వహించారు. ఇప్పటివరకు తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైన మందులు ఇచ్చామని తెలిపారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక హాస్పిటల్‌ లో చేరాలని సూచించినట్టు వివరించారు. రోజువారీ పనులు, ఉపాధి కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వలస వెళ్తుంటారు.

ఈ క్రింది వీడియోని చూడండి

అయితే ఇలా ఎక్కువమంది బిడ్డలకు జన్మనివ్వడం మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు. మహిళ గర్భంలో పిండం పెరిగే అవయవమైన గర్భాశయం ఒక కండరం లాంటిది. కాన్పు జరిగిన ప్రతిసారీ అది సాగుతుందని వైద్యులు తెలిపారు. ఎక్కువసార్లు గర్భం దాల్చిన మహిళలో గర్భాశయం సంకోచించడం కష్టమవుతుంది. వరస కాన్పుల వల్ల గర్భసంచి బలహీనపడటమే కాకుండా, తీవ్రస్థాయిలో రక్తంస్రావం ముప్పు పొంచి ఉంటుంది. గత ప్రసవాలకు సంబంధించి గర్భాశయంలో ఉండిపోయే స్కార్‌ కణజాలం ప్లసెంటాకు సమస్యల్ని సృష్టించడమే కాకుండా, నెలలు నిండకుండానే ప్రసవం కావడం లాంటి ముప్పులకు కూడా దారితీస్తుంది. ఒక్కొక్కసారి తల్లి ప్రాణాలే పోయే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇలా ఎక్కువమంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపకండి. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు అనే సిద్ధాంతాన్ని నమ్మండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation