చిన్నారి ప్రాణం తీసిన సపోటా గింజ

124

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండల కేంద్రంలో విషాదం జరిగింది. సపోటా గింజ చిన్నారి ప్రాణం తీసింది. నాలుగేళ్ల బాబు మృత్యువాత పడ్డాడు. సపోటా పండు గింజ గొంతులో అడ్డుపడి అనపురం శివకుమార్‌ (4) అనే చిన్నారి ఊపిరి ఆగింది. మండల కేంద్రానికి చెందిన అనపురం లింగంగౌడ్‌-సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. లింగంగౌడ్‌ ఉపాధి కోసం గల్ఫ్‌ దేశంలో ఉంటున్నాడు. సుజాత.. బీడీ కార్మికురాలిగా పనిచేస్తోంది. గ్రామంలో నిర్వహించిన సంతలో పిల్లల కోసం తల్లి సుజాత.. సపోటా పండ్లు ఇంటికి తీసుకొచ్చింది.

Image result for చిన్నారి ప్రాణం తీసిన సపోటా గింజ

తల్లి తెచ్చిన సపోటాలను శివకుమార్‌ తింటున్నాడు. ఇంతలో ఓ గింజ గొంతులో అడ్డు పడింది. దీంతో శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం మెట్‌పల్లికి తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే శివకుమార్‌ మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెరిగిన బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. అప్పటిదాకా కేరింతలు కొట్టిన పిల్లాడు.. ఆటలాడుతూ ఆహ్లాదంగా ఉన్న చిన్నారి.. ఇలా మృత్యువాత పడటాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. బోరున విలపిస్తున్నారు. పిల్లల కోసం ప్రేమగా తెచ్చిన సపోటా పండు.. తన బిడ్డ ప్రాణం తీయడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పలువురిని కంటతడి పెట్టించింది.

ఈ క్రింది వీడియోని చూడండి

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన తెలిపింది. ఆహారం విషయంలో పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. దగ్గరుండి వారికి తినిపించాలి. గింజలు, విత్తనాల లాంటివి.. పిల్లల నోట్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ దే. ఏది తినాలి, ఏది తినకూడదనే విషయం చిన్న పిల్లలకు తెలియదు. ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటారు. అందుకే తల్లిదండ్రులు కేర్ ఫుల్ గా ఉండాలి. ఓ కంట కనిపెట్టాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, అలసత్వం చూపినా.. జరగరాని ఘోరం జరిగిపోతుంది. పూడ్చుకోలేని నష్టం మిగులుతుంది. ఘోరం జరిగాక ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation