19 ఏళ్ల యువకుడితో 45ఏళ్ల ఆంటీ పరార్ ఇంతకీ అతడి స్పెషాలిటీ తెలిస్తే మతిపోతుంది

74

కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. 45ఏళ్ల మహిళ 19ఏళ్ల యువకుడితో పరారు కావడం స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆ మహిళ తన కుమారుడిని కిడ్నాప్ చేసిందని యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Image result for love

రాయ్‌చూర్‌కు చెందిన నిర్మల అనే మహిళ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తోంది. ఆమె కొడుకు నరేశ్ (19) మహాబలేశ్వర్ సర్కిల్ వద్ద గల ఓ ఉడిపి హోటల్‌లో పనిచేస్తున్నాడు. అదే హోటల్‌లో చంద్రిక(45) అనే మహిళ కూడా పనిచేస్తోంది. అయితే వారం రోజులుగా నరేశ్ కనిపించకపోవడంతో అతడి తల్లి బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా అతడి జాడ కనిపించలేదు. అదే సమయంలో హోటల్‌లో పనిచేసే చంద్రిక కూడా వారం రోజులుగా పనికి రావడం లేదని నిర్మలకు తెలిసింది. లోతుగా ఆరా తీయగా నరేశ్‌, చంద్రిక ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లిపోయినట్లు వెల్లడైంది.

దీంతో నిర్మల బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రిక తన కుమారుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు చంద్రికకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఆమె భర్తను విచారించగా చంద్రిక ఎక్కడికి వెళ్లిందో తనకు తెలీదని చెబుతున్నాడు. దీంతో పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

Content above bottom navigation