భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జపాన్ ప్రధాని

అంతర్జాతీయ ఉత్పత్తి రాజధానిగా భాసిల్లుతున్న చైనాను ప్రపంచ దేశాలు కొద్దినెలల క్రితం వరకు తమ వర్క్‌షాప్‌ గా చెప్పుకొన్నాయి. కానీ చైనాపై అధికంగా ఆధారపడినందుకు ప్రపంచ దేశాలు ఇటీవల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావడంతో ఇప్పుడు చైనాకు దూరంగా జరిగేందుకు తొందర పడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీస్థాయిలో వస్తువులను ఉత్పత్తి చేస్తున్న చైనా, 2009 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారిగా కొనసాగుతున్నది. ప్రపంచ దేశాలకు అనేక రకాల వస్తువులను ఎగుమతి చేస్తూ రోజురోజుకూ ఆర్థికంగా ఎంతో బలపడుతున్న చైనా, ఈ ఏడాది తమ ఉత్పత్తులతో పాటు ప్రాణాంతక వైరస్‌ ను కూడా ప్రపంచానికి ఎగుమతి చేసింది. అదే ఇప్పుడు చైనా కొంప ముంచుతున్నది. ఈ వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం యావత్‌ ప్రపంచ ప్రజలంతా వ్యక్తిగత దూరాన్ని పాటిస్తున్నారు. ఇదే విధంగా చైనాతో ఆర్థిక దూరాన్ని పాటించడం శ్రేయస్కరమని పలు దేశాలు భావిస్తున్నాయి.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

భారత్-జపాన్ మధ్య అణు ఒప్పందం... | pm modi ...

ప్రాణాంతక వైరస్ ను ప్రపంచానికి అంటించిన చైనాకు మొదటి సెగ తగిలింది. చైనాకు మొట్టమొదటి షాక్ ను దాని పక్కనే ఉండే జపాన్ దేశం ఇచ్చింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్ దేశం, అంటువ్యాధులతో అతలాకుతలంగా ఉన్న చైనా నుంచి తమ కంపెనీలను వైదొలగాలని పిలుపునిచ్చింది. జపాన్ ప్రధాని షింజో అబే తాజాగా 2.2 బిలియన్ అమెరికన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో 50 వేల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని తమ కంపెనీలకు ఇచ్చారు. ఇది జపాన్ ఆర్థిక ఉత్పత్తిలో 20శాతానికి సమానం కావడం విశేషం. జపాన్ తయారీ దారులు మొత్తం చైనా నుంచి ఉత్పత్తి చేయడం ఆపేసి తమ దేశానికి రావాలని, ఇక్కడే ఉత్పత్తి చేయాలని అందుకోసం ఏకంగా భారీ ప్యాకేజీని జపాన్ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైరస్ తో దెబ్బతిన్న జపాన్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి జపాన్ ప్రధాని ఇలా చైనాలో నెలకొల్పిన తమ కంపెనీలను దేశానికి రావాలని ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ వైరస్ కారణంగా చైనాలో అంటు వ్యాధి తీవ్రంగా ప్రబలి కంపెనీలు మూతపడ్డాయి. చాలా మంది జపనీయులు కూడా చనిపోయారు. దీంతో నష్టాలు ఏర్పడి ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో జపాన్ ఈ తీవ్రమైన చర్య తీసుకుంది. తమ కంపెనీలను తమ దేశానికి రప్పిస్తోంది. ఈ చర్యతో చైనాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు.

సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

గతంలో చైనాకు జపాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కానీ ఫిబ్రవరిలో వైరస్ చైనాలో వ్యాపించడంతో కర్మాగారాలను మూసివేశారు. దీంతో చైనా నుంచి దిగుమతులు జపాన్ దేశానికి సగానికి పడిపోయాయి. దీంతో జపనీయులు బాగా దెబ్బతిన్నారు. ఆకలిదప్పులు ఎదుర్కొన్నారు. చైనా నుంచి 148 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను జపాన్ కు ఎగుమతి అవుతాయి. అవన్నీ ఆగిపోవడంతో జపాన్ చాలా తీవ్ర ఇబ్బందులు పడింది. ఇతర దేశాలు చేసినట్టు చైనాపై ఆరోపించకుండా తమ కంపెనీలను వెనక్కి రప్పించడం ద్వారా జపాన్ చైనాకు గట్టి షాక్ ఇచ్చినట్టైంది. ఇది మరిన్ని దేశాలకు ఊతంగా మారింది. ఇదే జరిగితే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక చైనా నుంచి జపాన్ కంపెనీల నిష్క్రమణలతో ప్రధానంగా ఐదు దేశాలకు లబ్ధిచేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో భారత్‌ ముందు వరుసలో ఉన్నది. చైనాకు ఏమాత్రం తీసిపోనంత భారీస్థాయిలో కార్మికులను, మార్కెట్‌ను కలిగి ఉండటం, శ్రామికశక్తి చౌకగా అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు. ఒకవేళ చైనా నుంచి వెళ్ళిపోయినా కంపెనీలు భారత్ కు కనుక తిరిగి వస్తే అది భారత్ పారిశ్రామిక రంగానికి ఎంతో మేలు అని చెప్పవచ్చు. భారత్ లో కంపెనీలను పెట్టాలని జపాన్ ప్రధాని షింజో అబే కూడా అనుకుంటున్నాడు. దీని గురించి ఇప్పటికే భారత ప్రధాని మోడీతో చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మన దేశంలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి.

Content above bottom navigation