90 లీటర్ల చనుబాలు దానమిచ్చిన తల్లులు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

61

పిల్లలకు తప్పకుండా తల్లి పాలు ఇవ్వాలి. చనుబాలు వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతారు. కానీ, ఈ రోజుల్లో అందాన్ని కోల్పోతామనే భయంతో చాలామంది తల్లులు పిల్లలకు చనుబాలు ఇవ్వడం లేదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.సొంత పిల్లలకే పాలు ఇచ్చేందుకు ఆలోచించే ఈ రోజుల్లో.. పరాయి పిల్లలకు తమ చనుబాలను దానమిచ్చే తల్లులు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యకరమే. పలు కారణాల వల్ల చనుబాలుకు దూరమయ్యే పిల్లల కోసం ఓ మహిళ స్వచ్ఛందంగా ప్రారంభించిన ‘తల్లిపాల బ్యాంక్’ ఇప్పుడు ఎంతోమందికి చిన్నారులకు ప్రాణం పోస్తోంది. ఈ బ్యాంక్ మరెక్కడో కాదు, మన దేశంలోనే అహ్మదాబాద్‌లో ఉంది.

రుషినా మార్ఫాటియా అనే మహిళ తన బిడ్డ కోసమే కాకుండా, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలను బతికించేందుకు అదనంగా చనుబాలను ఉత్పత్తి చేస్తోంది. ఇటీవల ఐసీయూలో చావుబతుకుల మధ్య పోరాడుతున్న ఐదుగురు పిల్లలు ఆమె చనుబాలు వల్లే బతికారంటే ఆశ్చర్యపోక తప్పదు.ఈ సందర్భంగా అర్పన్ న్యూబోర్న్ కేర్ సెంటర్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ మెహతా మాట్లాడుతూ.. ‘‘రుషినా మేలు మరవలేనిది. 600 నుంచి 1.5 కిలోలు లోపు జన్మించిన పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వాళ్లు చాలా వీక్‌గా కూడా ఉంటారు. అలాంటి పిల్లలకు చనుబాలే ఔషదం. ఆ సమయంలో రుషినా తన చనుబాలు ఇచ్చి వారి ప్రాణాలు కాపాడారు’’ అని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation