ఒకవైపు కరోనా..మరోవైపు పెను భూకంపం: ఈ భూగోళానికి ఏమైంది: సునామీ హెచ్చరికలు జారీ

168

ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా అల్లాడిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెను భూకంపం వణికించింది. 7.5 మ్యాగ్నిట్యూడ్‌తో ఏర్పడిన ఈ భూకంపంతో రష్యా, జపాన్, హవాయ్ ఉలిక్కిపడ్డాయి. భీతిల్లిపోయాయి. పసిఫిక్ మహా సముద్రంలో ఈ భూకంపం సంభవించడం, దీని తీవ్రత అంచనాలకు మించి ఉండటం వల్ల అప్పటికప్పుడు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సునామీ సంభవించే అవకాశం లేకపోవడంతో.. వెంటనే దాన్ని ఉపసంహరించాయి.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

2006 తరువాత ఆ స్థాయి తీవ్రతతో..

ష్యా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. రష్యాకు చెందిన కురిల్ ఐలండ్స్ సమీపంలో పసిఫిక్ మహాసముద్ర గర్భంలో భారీగా ప్రకంపనలు సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. జపాన్‌లోని సప్పొరొ నగరానికి ఈశాన్యం దిక్కున 1400 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్ర గర్భంలో 59 కిలోమీటర్ల లోతున ఉన్న ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించారు.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. ఆ వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ అప్రమత్తమైంది. సునామీ హెచ్చరికలను జారీ చేసింది. భూకంప కేంద్రం నుంచి సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాకాసి అలలు సునామీ రూపంలో విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సునామీ సంభవిస్తున్నట్లు జాడలు లేకపోవడంతో ఈ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అధికారులు ఈ హెచ్చరికలను ఉపసంహరించారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

భూకంపం తరువాత గరిష్ఠంగా 0.3 మీటర్ల ఎత్తు వరకే అలలు ఎగిసిపడ్డాయని, ఫలితంగా సునామీ హెచ్చరికలను ఉపసంహరించినట్లు వెల్లడించారు. కాగా- ఈ భూకంపం వల్ల రష్యా, జపాన్, హవాయ్ వణికిపోయాయి. సునామీ విరుచుకుపడే ప్రమాదం ఉండొచ్చని భీతిల్లిపోయాయి. అమెరికా జియోలాజికల్ సర్వే నుంచి సమాచారం అందిన వెంటనే కురిల్ ఐలండ్స్, సప్పొరో తీర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.ప్రపంచపటంలో పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఓ చుక్కలా కనిపించే హవాయ్‌ ద్వీప ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీర ప్రాంతాలను ఖాళీ చేశారు. సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. సమయం గడుస్తున్న కొద్దీ సునామీ తరహా వాతావరణం ఏదీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పసిఫిక్ మహాసముద్రం జోన్ పరిధిలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడం 2006 తరువాత ఇదే తొలిసారి. 2006లో ఇదే జోన్‌లో 8.3 తీవ్రతతో పెనుభూకంపం సంభవించింది.

Content above bottom navigation