నీటితో నడిచే జీపు కారు బైక్.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఓ యువకుడు తయారు చేసిన ఈ ఆవిష్కరణ మాత్రం ఔరా అనిపిస్తోంది. అతనేమీ ఇంజనీర్ కాదు పెద్ద ఉన్నత చదువులు చదవుకోలేదు పైగా అతనేమీ సిటీలో ఉండటం లేదు
గ్రామీణ ప్రాంతంలో ఉంటూ ఇలాంటి నవ ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నాడు ఇంతకీ ఎవరా వ్యక్తి అనేది చూద్దాం
సృజన తోడు ఉంటే కచ్చితంగా ఏదైనా సాధించవచ్చు
మన పై మనకు నమ్మకం ఉంటే ఎంత హైట్స్ కి అయినా చేరవచ్చు అంటున్నాడు అనంతపురం జిల్లా పాపసానపల్లెకి చెందిన దిలీప్….డిగ్రీ మధ్యలో మానేసి మెకానిక్ గా పని చేస్తున్నాడు, ఇలా తాను పని చేస్తున్న చోటే అనేక ఆవిష్కరణలకు అంకురార్పన చేశాడు.. తాను పని చేసుకుంటూనే ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు దిలీప్.

గతంలో ఆటో ఇంజిన్ తో హెలీకాఫ్ట్ ర్ తయారు చేశాడు …గాలిలో ఎగిరాడు.. దీనికి కేవలం డీజీల్ మాత్రమే ఉపయోగించాడు, దీంతో పోలీసులకి స్ధానికులు కంప్లైంట్ ఇవ్వడంతో అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు, వెంటనే ఆ పరికరం తొలిగించాడు, అయినా అతనిలో పట్టు సడలలేదు ..మరిన్ని ఆవిష్కరణలు చేయాలి అని సంకల్పించాడు. తర్వాత నీటితో నడిచే జీపు బైక్ కూడా తయారు చేశాడు, లెస్ ఇన్వెస్ట్ మెంట్ తో వీటిని తయారు చేశాడు. అయితే 10 అలాగే 20 కిలోమీటర్ల మేలేజ్ వచ్చే బైకులు స్టార్ట్ చేశాడు.. ఇలా చాలామందికి ఇవి ఆకట్టుకున్నాయి, వీటి తయారికీ పలురకాల బ్యాటరీలు ఉపయోగించాడు దిలీప్.

ఇక తను తయారు చేసిన సోలార్ స్కూటీలకి మంచి ఫేమ్ వచ్చింది.. అయితే వీటిని ఇక్కడ కొందరు కావాలని చేయించుకుంటున్నారు.. దిలీప్ తో పాటు పలువురు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇక అతనికి స్దానిక వైద్యులు నీలిమారెడ్డి గురుమూర్తి అతని ప్రతిభమెచ్చి చేరదీశారు..,అతను తయారు చేసిన వస్తువులకి పేటెంట్ల కోసం దిల్లీలో వాటిని నమోదు చేయించేందుకు కష్టపడుతున్నాడు, అంతేకాదు దేశ వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చాడు, ఇప్పటికే మూడు సంవత్సరాలు దీని కోసం ప్రయత్నాలు చేశాడు.

నాకు ఇలా ఇన్నోవేషన్స్ చేయడం ఇష్టం అని చెబుతున్నాడు… నిజంగా దిలీప్ చేస్తున్న ఆవిష్కరణలకు జిల్లాలోనే గుర్తింపు చాలా వచ్చింది… ఇక ప్రభుత్వం అతనికి మరింత ప్రొత్సాహం అందిస్తే మరింత హైట్స్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు స్ధానికులు, సో దిలీప్ కి సర్కారు సాయం చేయాలి అని కోరుకుందాం.