స్కూటీలో నాగు పాము.. హడలెత్తిన ఎఫ్‌సీఐ ఉద్యోగి

141

పాము..ఈ పేరు వింటే చాలు చాలా మంది ప్యాంట్ తడిసిపోతుంది.ఎందుకంటే అది చాలా డేంజరస్ జీవి కాబట్టి.అక్కడ పాము ఉందని తెలిస్తే చాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మనం అస్సలు వెళ్ళం.అయినా గానీ అవే మనం ఉన్నచోటుకు అప్పుడప్పుడు వస్తు ఉంటాయి. అయితే వీధిలోకి వచ్చినా లేదా ఇంట్లోకి వచ్చినా కూడా కనపడితే దానిని చంపేసో లేదా తరిమో పంపించేస్తాం. కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు తిరిగే మన బైక్ లోనే స్థావరం ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది. బైక్ మీద కూర్చోవాలంటేనే భయం వేస్తుంది కదా. అలంటి ఘటనే ఇప్పుడు చోటు చేసుకుంది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింది వీడియో చూడండి

యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ముందులా ఖాళీ స్థలం ఉండడంతో స్కూటీని ఆపి వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక పాము వచ్చి స్కూటీ ఎక్కేసింది. ఎవరు లేరు అనుకుందేమో సరిగ్గా స్కూటికి ముందులా ఉండే ఒక బాక్స్ లాంటి ప్లేస్ లో సెటిల్ అయిపోయింది. ఇక మరుసటి రోజు ఆఫీస్ కు అని బయలుదేరారు. అయితే రాంపల్లిలోని మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టు అనిపించింది. దీంతో బండిని నిలిపి పరీక్షించగా నాగు పాము కనిపించడంతో, స్కూటీని కిందపడేసిన రాములు భయంతో పరిగెత్తారు. ఒక్క క్షణం ప్రాణాలు పోయి వచ్చినట్టు అతనికి అనిపించింది.

Image result for స్కూటీలో నాగు పాము..

తరువాత స్కూటిలో పాము ఉందని స్థానికులకు చెప్పాడు. వెంటనే స్థానికులు మెకానిక్‌ సహాయంతో వాహన భాగాలు ఊడదీశారు. అక్కడే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోద్ గౌడ్ గమనించి, పాములు పట్టే ఎరుకలి మైసయ్య అనే వ్యక్తిని పిలిపించారు. దీంతో ఆయన చాలా సేపు ప్రయత్నించినప్పటికీ స్కూటీ హెడ్ లైట్‌లో చిక్కుకున్న పామును బయటకు తీయలేకపోయారు. చివరకు స్కూటీ పార్ట్‌లు విడదీసి ఎట్టకేలకు పామును పట్టుకున్నారు. దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అతను ఆ పామును బయటకు తీసి పట్టణ శివార్లలో పొదల్లో సురక్షితంగా వదిలేశారు. అది చిన్నపామే అయినా కాటేసి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదన్నారు. ఎందుకంటే అది మామూలు పాము కాదు నాగుపాము. దేవుడి దయవల్ల ఆ పాము అతనిని కాటెయ్యలేదు. పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న రాములు స్కూటీ పైనుంచి కింద పడటంతో స్వల్ప గాయాలు అయ్యాయి. చూశారుగా స్కూటిలో పాము ఎలా చేరిందో. కాబట్టి మీరు కూడా బైక్ స్కూటీ మీద వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఏ విష జీవి వచ్చి ఎప్పుడు ఎక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంటుందో తెలీదు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation