వీడియో: పడగ నీడలో మెరిసిపోతూ.. తోటలో అరుదైన పాము!

398

పాము.. ఈ పేరు వింటే చాలు చాలా మంది ప్యాంట్ తడిసిపోతుంది. ఎందుకంటే అది చాలా డేంజరస్ జీవి కాబట్టి. అక్కడ పాము ఉందని తెలిస్తే చాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మనం అస్సలు వెళ్ళం. అయినా గానీ అవే మనం ఉన్నచోటుకు అప్పుడప్పుడు వస్తు ఉంటాయి. మనం ఇప్పటివరకు ఎన్నో రకాల పాములను చూసి ఉంటాం. నాగుపాము, త్రాచుపాము, కొండచిలువ…. ఇలా చెప్పుకుంటూపోతే 270 రకాల పాముల పేర్లు చెప్పవచ్చు. అయితే మీరెప్పుడైనా మెరిసే పామును చూశారా… మెరిసే పామా…. పాము మెరుస్తుంది కూడానా….అని అనుకుంటున్నారా.. ఇప్పుడు ఒక మెరిసే పాము అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరి ఆ మెరిసేపాము గురించి పూర్తీగా తెలుసుకుందామా.

మన చుట్టూ ఎన్నో రకాల జీవులు తిరుగుతూ ఉంటాయి. అంధులలో పాములు కూడా ఒక జీవి. మనకు కనపడకుండా మన చుట్టే తిరుగుతాయి, అప్పుడప్పుడు మన ఇంట్లోకి కూడా వస్తుంటాయి. అయితే మీరు ఎన్నడూ చూడని పాము మీ ఇంట్లోకి వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. దానిని చూసి భయపడటం పక్కన పెడితే ముందు ఆశ్చర్యపోతాం కదా.. అలాంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది.కర్ణాటకలోని కొప్ప తాలుకా హోలమక్కికి చెందిన అవినాశ్ అనే వ్యక్తి ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఉంది. అందులో ఆయన రకరకాల మొక్కలను పెంచుతున్నారు. ఇటీవల ఆ తోటలోకి ఆ అరుదైన సర్పం వచ్చింది. దాన్ని గమనించిన పెంపుడు కుక్క గట్టిగా అరిచింది. దీంతో అప్రమత్తమైన అవినాశ్ కుటుంబసభ్యులు ఆ అరుదైన పాముకు సంబంధించిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్లను బంధించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

వెంటనే ఈ విషయం గురించి స్థానికులకు చెప్పారు. అంతే అందరు అక్కడికి చేరుకొని ఆ పామును చూశారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ పడగ విప్పింది. సూర్యుడి కిరణాల వెలుగులో మరింత ప్రకాశిస్తోంది. అది అలాంటి ఇలాంటి సర్పం కాదని, అద్భుత శక్తులున్న పాము అని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరి సెల్ ఫోన్ లలో వాళ్ళు వీడియో తీశారు. సర్పానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పాము సాక్షాత్తు శివుడి మెడలో ఉండే నాగుపాముతో సమానం అని శివభక్తులు అంటున్నారు. మెరిసే లక్షణం ఒక్క శివుడి మెడలో ఉండే పాముకు ఉంటుందని స్థానికులు శివభక్తులు అంటున్నారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇలా పాము మెరవడం అంటే నిజంగా అద్భుతమే కదా.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation