ఉరితీసిన ఐదు నిమిషాల్లో నిర్భ‌య త‌ల్లి ఏం చేసిందో చూసి షాకైన జ‌నం

258

న్యాయానికి ఇన్ని ఏళ్లు ప‌ట్టింది.నిర్భ‌య కేసులో న‌లుగురు దోషుల‌కి ఉరిశిక్ష అమ‌లు చేయాల‌ని కోర్టు తీర్పు ఇవ్వ‌డంతో నేడు సూర్యోదయానికి ముందే వారికి ఉరి అమ‌లు అయింది.నేడు ఆ న‌లుగురు సూర్యోద‌యం చూడ‌కూడ‌దు అని వారికి శిక్ష ప‌డాలి అని అంద‌రూ అనుకున్నారు.చివ‌ర‌కు అదే జ‌రిగింది..ఎట్ట‌కేల‌కు వీరు న‌లుగురు చేసిన పాపానికి శిక్ష అనుభవించారు.ఏడేళ్లుగా ప‌ట్టువ‌ద‌ల‌ని శ్ర‌మ చేస్తున్న నిర్భ‌య‌త‌ల్లి ఆశ నేడు నెర‌వేరింది.నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ముఖంలో నేడు చిరున‌వ్వు క‌నిపించింది.ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలు అధికారులు వారికి మరణదండన అమలు చేశారు. అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దోషుల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు నిర్ధారించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

ఈ క్రింది వీడియో చూడండి

మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాడ్ నిర్భయ దోషులైన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరితీశాడు. దక్షిణాసియా దేశంలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరితీయడం ఇదే తొలిసారి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరి క్షణం వరకు దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలితంచలేదు. చట్టపరంగా వారికి ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. అయినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత వారికి ఉరిశిక్ష అమలైంది. నిర్భయ దోషులకు మరణ దండన అమలు కావడంపై నిర్భయ తల్లిదండ్రులతోపాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ నమిత

Image result for nirbhaya case
తన హోయలతో షేక్ చేస్తున్న హెబ్బా పటేల్

తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు దోషులు నలుగురికీ ఉరితీత పూర్తయిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషంగా కనిపించారు.తన కుమార్తె లేదని, ఇకపై రాదన్న‌ ఆమె.. కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు తమ పోరాటం నిర్భయ గురించేనని, ఇకపై మన కుమార్తెల కోసం పోరాడతానని చెప్పారు. దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్నానని ఆశాదేవి ఉద్వేగభరితంగా అన్నారు.మొత్తానికి వారికి ఉరిపడిందని పేర్కొన్న ఆశాదేవి.. ఇదో సుదీర్ఘకాల బాధ అని అన్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation