మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన చైనా మ‌రోసారి లాక్ డౌన్ టెస్టులు

22

చైనాలో వైర‌స్ సోకి, రికవరీ అయిన ప్రతి ఒక్కరికీ మరోసారి పరీక్షలు చేయాలని చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో సెకండ్ వేవ్ వైర‌స్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది వైర‌స్ మహమ్మారి కారణంగా 76 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉండిపోయిన వూహాన్ లో నిబంధనలను సడలించిన మరుసటి రోజు, చైనా తన నిర్ణయాన్ని ప్రకటించింది.ఇక, గురువారం నాడు కొత్తగా 63 వైర‌స్ పాజిటివ్ కేసులు రాగా, అందులో 61 మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారేనని చైనా నేషనల్ హెల్త్ మిషన్ ప్రకటించింది. దీంతో చైనాలో సెకండ్ వేవ్ లో భాగంగా 1,104 కేసులు నమోదైనట్లయింది. మరో ఇద్దరు మృత్యువాత పడటంతో వైర‌స్ మృతుల సంఖ్య 3,335కు చేరగా, మొత్తం కేసుల సంఖ్య 81,865కు చేరుకుంది.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ జాక్వెలిన్‌

Xi Jinping warns of grave situation as coronavirus death toll ...

వాస్తవానికి మూడు నెలల అవిశ్రాంత పోరాటం అనంతరం, చైనాలో పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఇంకా చెప్పాలంటే, శరవేగంగా తమ దేశంలో వైర‌స్ ను చైనా అదుపులోకి తెచ్చింది. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విమానాల నిలిపివేతతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారు, తిరిగి స్వదేశానికి చేరుతూ ఉండటంతో, కేసుల సంఖ్య పెరుగుతోంది.దీంతో చైనా, వైర‌స్ సోకి, ఆపై నెగటివ్ వచ్చిన వారందరి కోసం కొత్త ట్రయల్ ప్రొటోకాల్ ను విడుదల చేసింది. వీరందరినీ డాక్టర్లు పరీక్షిస్తారని, వారి నుంచి నమూనాలను స్వీకరించి, మరోసారి పరీక్షలకు పంపుతారని స్పష్టం చేసింది. వైర‌స్ పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న వూహాన్ లో వైర‌స్ నుంచి 77,370 మంది బయటపడగా, వారందరికీ ఇప్పుడు తిరిగి రక్త పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు కదులుతున్నారు.

టాప్ లెస్ ఫోటోషూట్‌లో అందాల విందు చేసిన కాజల్..

చైనా విధించిన కొత్త నిబంధనల ప్రకారం,వైర‌స్ నుంచి బయటపడిన వారంతా 14 రోజుల పాటు విధిగా హోమ్ క్వారంటైన్ పాటించాలి. వీరెవరకూ బయట తిరిగేందుకు వీల్లేదు. ఇంట్లోగానీ ఐసొలేషన్ సెంటర్ లోగానీ ఉంటూ, వైద్యాధికారులకు అందుబాటులోనే ఉండాలని ప్రభుత్వ రంగ క్సిన్హువా వార్తాసంస్థ పేర్కొంది.ఇక క్వారంటైన్ సమయంలో వీరంతా నిత్యమూ తమ శరీర ఉష్ణోగ్రతను నమోదు చేస్తుండాలని, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా వైద్యులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక రిటర్న్ విజిట్ పేషంట్ల కోసం పలు ఆసుపత్రులు తిరిగి ఏర్పాట్లు చేయడాన్ని ప్రారంభించాయి. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో మరిన్నివైర‌స్ కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న వైద్యులు, వైర‌స్ సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. మ‌రికొద్ది రోజులు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమ‌లు చేస్తార‌ట చైనాలో.

Content above bottom navigation