మన పురాణంలో చాలా వింతైన ఆశ్చర్యకరమైన గ్రంథాలు చాలానే ఉన్నాయి. వాటిని వింటే నిజంగానే ఇలా జరిగిందా అని అనుకోకుండా ఉండలేము. మీకు పురాణాలలో కొంచెం ఐన అవగాహనా ఉంటె మీకు అహల్య ఇంద్రుడి కథ తెలిసే ఉంటుంది. ఆ కథలో ఇంద్రుడి కామం గురించి పూర్తీగా మనకు తెలుస్తుంది. అయితే ఆ కథ తెలియని వాళ్ళు ఎందరో ఉంటారు. అలాంటివారి కోసమే ఈ కథ..
స్ప్రుష్టి కర్త బ్రహ్మ కూతురి పేరు అహల్య. గౌతమ మహర్షి భార్య అహల్య. ఆమె అమిత అందాలరాశి. ఆమెకు ఒక వరం ఉంది. అదేమిటి అంటే.. ఆమె తన జీవితం అంతా 16 ఏళ్ల అమ్మాయిలాగే ఉంటుంది. ఆమె అంత అందమైన స్త్రీ మూల్లోక్కాలోనే ఎవరు లేరు. అంత అందమైన అమ్మాయి కాబట్టే దేవతలకు ప్రభువైన ఇంద్రుడు ఆమెను చూసి కామ కోర్కెలతో రగిలిపోయాడు. అంతే, మహర్షి లేని సమయం చూసి మాయోపాయంతో ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అహల్యను అనుభవిస్తున్నాడు. వారు అలా రతిక్రీడలో విహరిస్తున్న సమయంలోనే గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు అహల్య ఇంద్రుడిని తన గర్భంలో ఇముడ్చుకుని తన భర్తకు కనిపించకుండా దాచేసింది.
అదేసమయంలో గౌతముడికి ఎక్కడి నుంచో ఆహ్వానం వచ్చింది. దాంతో తక్షణం భార్య అహల్యను రమ్మని గౌతముడు కూడా తీసుకెళ్లాడు. గౌతముడిని ఆహ్వానించిన ఆయన కూడా మహనీయుడు. ఇంద్రునితో అహల్య చేసిన పనిని దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. గౌతముడు అహల్యతో రాగానే మూడు ఆసనాలు వేసి సిద్ధంగా ఉంచాడు.

ఆ మూడు ఆసనాలను చూసిన గౌతముడు, నేను నా భార్య ఇద్దరమే వచ్చాం. మూడో ఆసనం ఎవరికీ అని ప్రశ్నించాడు. ఆ తర్వాత యోగ దృష్టితో చూశాడు. అహల్య, ఇంద్రుడు చేసిన పనీ, అహల్య గర్భంలో దాక్కున్న ఇంద్రుడిని చూశాడు. గౌతమ మహర్షికి పట్టరాని కోపం వచ్చింది. సహస్ర భగుడవు కమ్మని ఇంద్రుడిని శపించాడు. తప్పు తన భార్యదే అనుకుని రాయిలా మారిపొమ్మని అహల్యకు శాపం ఇస్తాడు. అలా రాయిలా మారుతుంది అహల్య. ఆ రాయే రామాయణంలో శ్రీరాముడి కాలికి తగిలి శాపవిమోచనం చెంది మళ్ళి అహల్యగా మారుతుంది. కామంతో కళ్లుమూసుకుపోయి పరాయి స్త్రీలను అనుభవించిన ఇంద్రుడు గౌతమ మహర్షి శాపంతో ఒళ్లంతా స్త్రీ యోనులై దురవస్థ పొందాడు. కాబట్టి పరాయి స్త్రీ విషయానికి వెళ్తే మనం కూడా దారుణమైన శిక్షకు గురవుతాం. కాబట్టి పరాయి స్త్రీ జోలికి వెళ్ళకండి.