ఈ కధను తెలుసుకునే ముందు ఇంద్రుడు ఎవరో అహల్య ఎవరో ముందుగా తెలుసుకుందాం..ఇంద్రుడు దేవతలకు రాజు..ఇంకా స్వర్గానికి అధిపతి..ఇతనికి ఒంటినిండా కళ్ళే ఉంటాయి..దీనికి అసలు అర్దం తనది కాదు అన్నదన్ని ఆక్రమించుకోవడం అన్న మాట..అహల్య..బ్రహ్మ సృష్టిలో ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు..అందులో అహల్య ఒకరు..అహల్య ఒక అందాల రాశి..సుగుణాల పోగు..గౌతమ మహర్షికి సేవలు చేస్తూ ఆశ్రమ పనులను చక్కగా నిర్వర్తించేందుకు చతుర్ముఖుడు ఏర్పాటు చేసిన వ్యక్తి అహల్య..ఇక వివరాలలోకి వెళ్తే ఒక రోజు బ్రహ్మ అహల్యను గౌతమ రుషికిచ్చి ఆమెను యుక్త వయసు వచ్చ్చే వరకూ పెంచి తరువాత మరలా తన దగ్గరకు తీసుకు రమ్మని చెబుతాడు..బ్రహ్మ చెప్పినట్టుగానే గౌతముడు అహల్యను యుక్త వయసు వచ్చే వరకూ పెంచి తరువాత బ్రహ్మ వద్దకు అహల్యను తీసుకెళ్తాడు..

బ్రహ్మ అహల్యను చూసి ఆమేను 16 ఏళ్ళ నిత్య యవ్వన వయస్కురాలిగా ఉండాలని దీవిస్తాడు..అలా దీవించిన తరువాత అహల్యకు పెళ్ళి చేద్దామని అనుకుంటాడు..అనుకున్నదే తడవుగా ఎవరైతే ఆహల్యను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారో వారు భూమి చుట్టూ వేగంగా తిరిగి రావాలని వారికి మాత్రమే అహల్యను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు..అనుకున్న దాని ప్రకారం యుక్త వయసులో ఉన్న అహల్యను ఆమె అందాన్ని చూసి దేవతలు దానవులు ఆమెను పెళ్ళి చేసుకుందామని వస్తారు..అహల్యను బ్రహ్మ చేతిలో పెట్టి గౌతమ రుషి తిరిగి వెళ్తూ ఉండగా అప్పుడే జన్మనిచ్చిన ఓ గోమాతను చూస్తూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు..ఈ విషయాన్ని దివ్య దృష్టితో చూసిన బ్రహ్మ కామధేనువు భూమితో సమానమని గోవు చుట్టూ చేసిన ప్రదక్షిణలను భూమి చుట్టూ తిరిగినట్టు భావించి గౌతమ మహర్షిని పిలిచి పెంచిన అతనికే అహల్యను ఇచ్చి వివాహం చేస్తాడు..

అహల్యతో పాటు కానుకగా బ్రహ్మగిరిని ఇస్తాడు..ఇది ఇలా అయ్యాక అహల్యపై కోరికను పెంచుకున్న ఇంద్రుడు ఎలా అయిన తన కోరికను తీర్చుకోవాలి అని అనుకుంటాడు..అనుకున్న విధంగానే ఒక రోజు ఇంద్రుడికి చంద్రుడు మబ్బుల వెనుక దాగుండి ఉండమని ఒక కోడి రూపంలో వచ్చి కోడై కూస్తాడు..ఈ విషయం తెలియని గౌతముడు తెల్లారింది ఆనుకొని నదికి స్నానానికి వెళ్తాడు..అదే సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యకు దగ్గరవుతాడు..ఇక్కడే జాగ్రత్తగా గమనించాలి.. కొన్ని పుస్తకాల ప్రకారం గౌతముడిలా మారువేషం లో వచ్చింది ఇంద్రుడే అని గ్రహించిన అహల్య అతను దేవతలకు రాజు కావడం వలన ఏమీ చేయలేకపోయిందని లిఖించబడి ఉంది..మరికొన్ని పుస్తకాల్లో నిజంగా వచ్చింది గౌతముడే అనుకొని సృంగారంలో మునిగిపోయిందట అహల్య..అయితే కోడి కూసింది గాని ఇంకా తెలవారలేదు కదా అని గౌతముడు తిరిగి వెనక్కి వచ్చాడు..తీరా ఇంటికి తిరిగి వచ్చాక తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి ఆగ్రహించాడు..వచ్చింది ఎవరో కూడా తెలుసుకోకుండా అలా చేసినందుకు బండ రాయిగా మారిపొమ్మని అహల్యను తరువాత మోసం చేసినందుకు ఇంద్రుడిని అతనికి సహాయం చేసిన చంద్రుడిని శపిస్తాడు.. శరీరం నిండా మచ్చలతో జీవించమని అలాగే అతని అంగం పనికి రాకుండా పోవాలని ఇంద్రుడిని శపిస్తాడు..అంతే కాకుండా దేని కోసం ఇదంతా చేసాడో అందుకు గాను శరీరం నిండా స్త్రీ జననాంగాలు ఉంటాయని శపిస్తాడు..అందువల్ల ఇంద్రుడు తన శరీరం నిండా 1000 స్త్రీ జననాంగాలు కలిగి ఉంటాడు..
ఈ క్రింది వీడియోని చూడండి
ఇదంతా జరిగి నవ్వుల పాలు కావడంతో తన బాధ్యతలను మరిచి ఒక గుహలో దాక్కుంటాడు..దీనివల్ల ప్రపంచం మొత్తం స్థంబించి పోతుంది..ఈ విషయాన్నంతా తెలుసుకున్న బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు..అతని తపస్సుకు శివుడు ప్రత్యక్షమయి జరిగిందంతా తెలుసుకొని ఈ సమస్యకు పరిష్కారంగా ఇంద్రుడి శరీరమ్మీద ఉన్నటువంటి 1000 స్త్రీ జననాంగాలను 1000 కన్నులుగా మారుస్తాడు..ఇక శాపంతో రాయిగా మారిన అహల్య త్రేతాయుగంలో రాముడి కాలి స్పర్శ తగిలి స్త్రీగా మారి శాప విమోచనం నుంచి బయట పడుతుంది..ఇదండీ అహల్యకు ఇంద్రుడికి మధ్య జరిగిన కధా కమామీషు..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..
ఈ క్రింది వీడియోని చూడండి