మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే అమృత చేసిన పనికి అందరు షాక్..

294

తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ ప్రణయ్ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, సెప్టెంబ‌ర్ 14న ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు,అంతే కాకుండా తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ప్రకటించాడు. మారుతీరావు 7 నెలలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు.అయితే ఇప్పుడు ఈ కేసులో మరొక ట్విస్ట్ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే అతని కూతురు అమృత చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మ హత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో మారుతీరావు, అమృతకు రాయబారం పంపినట్లు తెలిసింది. పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల కిందట విడుదలైన మారుతీరావు అప్పటి నుంచి కూతురు అమృతను వేధిస్తున్నట్లు తెలిసింది. అమృత ఫిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు మిర్యాలగూడ పోలీసులు. ఆ తర్వాత మళ్లీ బెయిల్ పై విడుదలయ్యారు. కూతురు దూరమైందని తీవ్ర మనస్తాపంతో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు… ఆత్మహత్యకు కారణం పోలీసుల వేధింపులే అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

ప్రణయ్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈలోగా మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మారుతీరావు భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసుల ఒత్తిడితోనే ఆయన చనిపోయినట్లు మారుతీరావు భార్య అంటున్నారు. ఇక మారుతీరావు ఆత్మహత్య విషయం గురించి ఆయన కూతురు అమృతను అడిగితే మాత్రం.. తనకు అసలు ఈ విషయం గురించి తెలియదని.. అసలు అతను ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదని ఆమె తెలిపింది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అమృత ప్రణయ్ ఫోటో దగ్గరకు వెళ్లి చేసిన కొన్ని కామెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రణయ్ ఇప్పుడు నీ ఆత్మ శాంతిస్తుందని నేను అనుకుంటున్నా. నాకు నిన్ను దూరం చేసిన వ్యక్తి ఇక లేడు. ఇన్ని రోజులుగా నేను పడుతున్న మనోవేదన ఇప్పుడు కొంచెం తీరింది. మనల్ని దూరం చేసిన మానవమృగం పరలోకానికి వెళ్ళింది. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని అమృత చెప్పడం అక్కడ ఉన్న వాళ్ళందరిని ఆశ్చర్యపరిచింది.

Content above bottom navigation