మా అమ్మని కూడా చంపేస్తారు.. అమృత సంచలన వాఖ్యలు

క‌న్న‌కూతురు త‌న ద‌గ్గ‌ర‌కు రావ‌డం లేదు అనే బాధ మారుతీరావుని వేధించింది.ఎవ‌రిని మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి పంపినా కూతురు మ‌న‌సు క‌ర‌గడం లేదు,గ‌తంలో త‌ను చూపించిన ప్రేమ ఇప్పుడు లేదు. ప్రాణంగా పెంచుకున్న కూతురు విల‌న్ గా చూడటం మారుతీరావు త‌ట్టుకోలేక‌పోయాడు.ప్ర‌ణ‌య్ కేసులో లైఫ్ టైం జైలు శిక్ష ప‌డుతుంది అని తెలుసుకున్నాడు.చివ‌ర‌గా కూతురు త‌న మాట విని వెన‌క్కి వ‌స్తుంది అనుకున్నారు.. కాని ఆమె త‌న తండ్రిపైనే రెండు కేసులు పెట్టింది.ఇవ‌న్నీ ఆయ‌న మ‌న‌సుని క‌లిచివేశాయి..చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాయి.అయితే తండ్రి చివ‌రి చూపు నోచుకోలేక‌పోయింది అమృత‌..తాజాగా ప‌లు ఆస్తి వివాదాల గురించి చ‌ర్చ జ‌రుగుతున్న వేళ ఆమె మీడియాతో ప‌లు విష‌యాలు పంచుకుంది.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన కుమార్తె అమృత అన్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత మీడియాతో మాట్లాడారు. తన భర్త ప్రణయ్‌ హత్య కేసులో శిక్ష భయంతోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది కరెక్ట్‌ కాకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

మారుతీరావుకు బినామీ పేర్లతో చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల విషయంలో బాబాయ్‌ శ్రవణ్‌కు ఆయనకు మధ్య గొడవలు ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్‌ కొన్నిసార్లు కొట్టినట్లు నాకు తెలిసింది. డబ్బుల విషయంలో సుపారీ గ్యాంగ్ బెదిరింపులు కూడా ఆత్మహత్యకు ఒక కారణం కావొచ్చు. బాబు పుట్టాక అమ్మ నాతో మాట్లాడింది. బాబును చూపించాలని కోరితే నేను నిరాకరించా. నాన్నకు కోర్టు పరంగా శిక్ష పడాలని కోరుకున్నా. ఆత్మహత్య చేసుకోవడం తప్పే. మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కూతురిగా బాధ పడుతున్నా. శ్రవణ్ నుంచి అమ్మకు ప్రాణ హాని ఉంది. శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించారు. మారుతీరావు ఆస్తులపై నాకు ఆసక్తి లేదు అని అమృత అన్నారు. తల్లి దగ్గరకు వెళ్లేది లేదని తెగేసి చెప్పిన అమృత.. ఆమె తన దగ్గరకు వస్తే బాగోగులు చూసుకుంటానని చెప్పింది.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

ఎట్టి ప‌రిస్దితుల్లో ఆ ఇంటికి తాను వెళ్ల‌ను అని త‌న బాబాయ్ ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌ను అని చెప్పింది, ఇక కోట్ల రూపాయ‌ల ఆస్తులు నాకు వ‌ద్దు అని, నా ప్ర‌ణ‌య్ లేన‌ప్పుడు ఆస్తులు ఎందుకు అని బాధ‌ఫ‌డింది, త‌న త‌ల్లి ఇక్క‌డ‌కు వ‌స్తే చూసుకుంటా నేను అక్క‌డ‌కు వెళ్ల‌ను అని మీడియాతో చెప్పింది, మ‌రో ప‌క్క శ్ర‌వ‌ణ్ కూడా ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ, నాకు ఈ కేసు గురించి సంబంధం లేదు, న‌న్ను కావాల‌నే ఇరికించారు అని చెబుతున్నారు, ఆస్తి విష‌యంలో కూడా నాకు సంబంధం లేదు మా వ‌దిన ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా నేను అడ్డు చెప్ప‌ను అంటున్నారు, అయితే వీరిద్దరూ మీడియాతో ఇలా మాట్లాడుతున్నారు. కాని అమృత త‌ల్లి గిరిజ మాత్రం ఎలాంటి మాట‌లు ఇంకా మీడియాతో మాట్లాడ‌లేదు, అయితే మారుతీరావు అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.. ఇంకా 12 రోజుల కార్య‌క్ర‌మాలు పూర్తిచేయాలి, ఇవి అయిన త‌ర్వాత అమృత త‌ల్లి మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది అంటున్నారు కుటుంబ స‌భ్యులు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation