మా నాన్నని చంపింది వాడే .. వెలుగులోకి షాకింగ్ నిజాలు

మారుతీరావు మరణం తరువాత మిర్యాలగూడలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మారుతీరావు భౌతిక కాయాన్ని మిర్యాలగూడ తీసుకొచ్చిన తరువాత, తండ్రి భౌతికకాయం చూసేందుకు అమృత పోలీసుల భద్రత కోరింది. అయితే, అమృత తల్లి, బాబాయ్ లు అందుకు అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మారుతీరావు మరణం తరువాత అమృత ఈ విషయంపై ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

అమృత సోమవారం మిర్యాలగూడలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఓ మనిషిని చంపగలిగినంతవాడు ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. మారుతీరావు ఆత్మహత్యకు కారణాలు నాకు తెలియదు. బహుశా ఒత్తిడి వల్లే నాన్న చనిపోయి ఉంటాడని అనుకోను. ఆస్తి తగాదాలే ఆత్మహత్యకు కారణం కావచ్చు. వీలునామాలో బాబాయ్‌ శ్రవణ్‌ పేరు ఉంటే అనుమానం​ వస్తుందని పేరు తీయించేసి ఉండాలి. జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నాన్న.. నన్ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు.

Image result for amrutha pranay

అక్కడకు వెళ్లడం నాకిష్టం లేదు. ఇక నా గురించి అయితే మారుతీరావు ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్లు. చనిపోవడానికి వేరే కారణాలు ఉండి ఉండవచ్చు. ప్రణయ్‌ హత్య కేసులో చట్టపరంగా మారుతీరావుకు ఉరిశిక్ష పడాలని కోరుకున్నాను. కేసులో కఠిన శిక్ష పడుతుందని కూడా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు. ఇక ఆస్తుల గురించి నాకు అవసరం లేదు. వాళ్ల ఆస్తుల మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నేను బయటకు వచ్చాక వాళ్లు ఆస్తులు పంచుకున్నారు. మారుతీ రావుకు ఆర్థిక సమస్యలు ముందు నుంచే ఉన్నాయన్న ఆమె.. తండ్రికి బినామీ ఆస్తులు ఉన్నాయన్నారు.

గతంలో పరువు విషయంలో మారుతిరావును బాబాయ్‌ చాలాసార్లు రెచ్చగొట్టాడు. నీ కూతురు ఎవరినైనా పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. నీకూ నాకూ సంబంధాలు ఉండవ్ అని శ్రవణ్ మారుతీరావును రెచ్చగొట్టేవాడు. నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందనేవాడు. మారుతీరావు తప్పు చేసినా, శ్రవణ్ ప్రభావం ఎక్కువగా ఉంది. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం శ్రవణ్ మాట వింటారు. మారుతీరావు సైతం శ్రవణ్‌కు భయపడతాడు.

Image result for amrutha pranay

ఆ విషయం మిర్యాలగూడలో అందరికీ తెలుసు. మారుతీ ఆత్మహత్యకు శ్రవణ్ తెచ్చిన ఒత్తిడి కారణమై ఉండొచ్చు. మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌ మధ్య గొడవలు ఉన్నాయి. నాన్నను బాబాయ్‌ రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది. ఆస్తి విషయంలో మా అమ్మకు బాబాయ్‌ నుంచి ప్రాణహాని ఉండచ్చొని నేను భావిస్తున్నాను. ఇక శ్మశానంలో నన్ను అడ్డుకోవడం సరికాదు. నన్ను అడ్డుకుంది కూడా బాబాయ్‌ వాళ్ల అమ్మాయి.

Image result for amrutha pressmeet

పిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. భర్త చనిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అందుకే మా అమ్మను పరామర్శించడానికి వెళ్లాను. బాబు పుట్టాక అమ్మ ఒకసారి నా దగ్గరకు వచ్చింది. నా భర్త ప్రణయ్‌ చనిపోయినప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నానో… ఇప్పుడు తండ్రి చనిపోయినా అంతే ధైర్యంగా ఉన్నాను. ప్రాణం తీసినా, తీసుకున్నా అందరికీ బాధే ఉంటుంది. మారుతీరావు ఆత్మహత్య తరువాత తల్లికి మోరల్ సపోర్ట్ కావాలి కాబట్టి తల్లి వద్దకు వెళ్తారా అని అడిగితె వెళ్ళేది లేదని తెగేసి చెప్పింది. తనకు కుటుంబం ఉందని, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పింది. అంతేకాదు, తల్లి తన దగ్గరికి వస్తానంటే తాను చూసుకుంటానని చెప్పింది. తండ్రి మరణించినపుడు కంటతడి పెట్టలేదు ఎందుకని అడిగితె, ప్రాణంగా ప్రేమించిన భర్తపోయినపుడు కంటతడిపెట్టకుండా ధైర్యంగా నిలబడ్డాను, ఇప్పుడు ఎలా కంటతడి పెడతాను అని మీడియాను ఎదురు ప్రశ్నించింది అమృత.

Content above bottom navigation