అమృత సంచలన నిర్ణయం.. తన కొడుకు పుట్టినరోజు నాడు ఏం చేసిందో తెలిస్తే సెల్యూట్ చేస్తారు

1117

కులంగోడలు బద్దలు కొట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి హత్యకు గురైనా ప్రయణ్.ఇంట్లో సంతోషకరమైన పరిణామం గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి చోటు చేసుకుంది. ప్రయణ్ కు ప్రతిరూపంగా అమృత మగబిడ్డకు ఆరోజు జన్మనిచ్చింది. త‌మ నుంచి దూర‌మైన ప్రణయ్ ని ఆ బిడ్డ‌లో చూసుకుంటున్నారు కుటుంబ సభ్యులు.ప్రణయ్, అమృత ల పెళ్లిరోజే బిడ్డ పుట్టడం ఆనాడు అంద‌రిని ఆనందానికి గురి చేసింది
సరిగ్గా ఇదే రోజు కులగోడలు బద్దలు కొట్టి అమృత ,ప్రణయ్ లు ఆర్య సమాజంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
తోడు నీడగా కలకాలం బతకాలని కలగన్నారు.

Image result for అమృత సంచలన నిర్ణయం.

అయితే అమృత తండ్రి చేతిలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు.ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.తన భర్తకు హత్యకు కారణమైన తండ్రిని శిక్షించాలని అమృత పోరాటం చేసింది.చివరికి తండ్రిని కటకటాలపాలు చేసింది. అప్పటి నుంచి అమృత ..అత్తింట్లోనే ఉంటోంది. అత్తమామలనే తల్లిదండ్రులుగా భావిస్తు జీవితాన్ని గడుపుతుంది. ఇక అప్పుడ‌ప్పుడూ ప్ర‌ణ‌య్ అమృతల గారాల పుత్రుడ్ని ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది.త‌న చిన్నారి రూపంలో ప్ర‌ణ‌య్ ని చూసుకుంటున్నాను అని చెబుతోంది. తాజాగా ప్ర‌ణ‌య్ అమృత‌ల బిడ్డ నిహ‌న్ పుట్టిన రోజుని చాలా గ్రాండ్ గా చేశారు.మిర్యాల‌గూడ‌లో ని సితార గ్రాండ్ హోట‌ల్ లో సెల‌బ్రేట్ చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

చాలా మంది ప్ర‌ముఖులు ఆ ఫంక్ష‌న్ కు వ‌చ్చారు ..ఈ స‌మ‌యంలో ప్ర‌ణ‌య్ ఫోటోల‌తో అక్క‌డ పెద్ద గ్యాల‌రీ ఏర్పాటు చేశార‌ట‌…అంతేకాదు పేద విద్యార్దుల‌కి ప్ర‌ణ‌య్ పేరుమీద అలాగే నిహ‌న్ పేరుమీద ఆర్ధిక సాయం చేశార‌ట‌.ఇలా ప్ర‌ణ‌య్ ని తాము గుర్తు చేసుకుంటున్నాము అంటున్నారు పేరెంట్స్ .నిజంగా విధి చాలా బ‌లీయ‌మైన‌ది ఆ ప్రేమ జంట‌ని క‌ర్క‌శంగా తండ్రి పొట్ట‌న పెట్టుకున్నాడు.త‌మ కుటుంబంలో ప్ర‌ణ‌య్ లేక‌పోవ‌డం ఇప్ప‌టికీ మ‌రిచిపోలేక‌పోతున్నాము అంటున్నారు ప్ర‌ణ‌య్ త‌ల్లిదండ్రులు అమృత‌ని కూడా త‌న సొంత కూతురిలా చూసుకుంటున్నారు.ఆ పుట్టిన రోజు ఫోటోలు ఇప్పుడు చూద్దాం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation