తన తండ్రి ఆస్తులను పరిశీలించి ఫోటోలు తీసుకున్న అమృత

129

మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా.. మారుతీరావు మరణం మరో సంచలనానికి కారణమైంది. తాజాగా అమృత తన తల్లిని కలిసిన అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక మారుతీరావు మరణించిన వారం రోజుల తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం పోలీసుల బందోబస్తు మధ్య మిర్యాలగూడలోని మారుతీరావు నివాసంలో అమృత తన తల్లిని కలిసి మాట్లాడింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్వేగపూర్వక వాతావరణం నెలకొంది. మారుతీరావు ఆత్మహత్య తర్వాత మొదటిసారిగా కలుసుకున్న తల్లీకూతుళ్లు తీవ్రంగా రోదించారు. అమృత వస్తున్న విషయం తెలిసి అప్పటికే పలువురు బంధువులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల పర్యవేక్షణ మధ్య అమృత తన బాబాయ్ శ్రవణ్‌ను కూడా కలిసింది. ఆయనతో కాసేపు మాట్లాడింది. అనంతరం తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలని కోరగా.. బాబాయ్ శ్రవణ్‌తో పాటు బంధువులను పోలీసులు పై అంతస్తులోకి పంపించారు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

అమృత తన తల్లి గిరిజతో సుమారు 20 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడింది. ఆ వివరాలు మీడియాకు వెల్లడించడానికి బంధువులు నిరాకరించారు. గత ఆదివారం మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా.. తన తండ్రి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన అమృతను బంధువులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె తన తల్లిని కలవలేకపోయింది. మొత్తంమీద తండ్రి మరణించిన ఏడు రోజుల తర్వాత పోలీసుల సాయంతో తన తల్లిని కలిసి మాట్లాడింది. మారుతీరావు చివరి కోరిగా నెరవేరే అవకాశం ఉండొచ్చని పట్టణ ప్రజలు, బంధువులు భావిస్తున్నారు. ప్రధానంగా అమృత తన తల్లితో ఏకాంతంగా ఏం మాట్లాడి ఉంటుందని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వెళ్లి 15 నిమిషాలు మాట్లాడి తన అత్తవారింటికి వెళ్లిపోయింది.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

Image result for తన తండ్రి ఆస్తులను పరిశీలించి ఫోటోలు తీసుకున్న అమృత

అమృత వెళ్లే సమయంలో మీడియాకు ఎలాంటి న్యూస్ అందకుండా జాగ్రత్త పడ్డారు. అమృత నిన్న నాగార్జున కాలనీలోని తన తండ్రికి సంబంధించిన ఫ్లాట్ లను పరిశీలించి ఫోటోలు తీసుకుంది. అంతేకాదు ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో కూడా, వాటి డాక్యుమెంట్స్ ను కూడా ఫోటో తీసుకుని పోయింది. అమృత తల్లిని కలిసి వెళ్తున్న సమయంలో కొంతమంది అక్కడ స్థానికులు అమృతను ఫోటోలు తీయడంతో ఈ వార్తలు బయటకు వచ్చాయి. కాగా తల్లీ కూతుళ్లు ఆ పది నిమిషాలు ఏమి మాట్లాడుకున్నారు..? వారి భ విష్యత్తుపై ఏమైనా చర్చ జరిగిందా..? కేసు వివరాలు చర్చకు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తన తండ్రి ఆస్థి అసలు తనకు అవసరం లేదని ఇప్పటి వరకు చెబుతూ వస్తున్న అమృత ఇప్పుడు తండ్రి ఆస్థి కోసం పధకారచన చేస్తుందా అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అమృత ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. తల్లీ కూతుళ్ల మధ్యే చర్చలు జరి గాయా..? లేక తన బాబాయితో కూడా మాట్లాడిందా..? అనే వి షయాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి మరణానంతరం ఏడూ రోజుల తర్వాత ఊహించని విధంగా తల్లిని కలవడంతో మిర్యాలగూడలో మరోమారు వీరి విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation