Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య 170కి చేరింది.
తెలంగాణలో బుధవారం ఒక్క రోజే ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.


వీరిలో ఏడుగురు విదేశీయులు కాగా, ఒకరు తెలంగాణకు చెందిన వ్యక్తి.
వారితో పాటు ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది.
ఈ స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం సృస్టిస్తోంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో కోవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదైంది.
మ‌రి దీంతో ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది అనేది చూద్దాం.

ఇప్ప‌టి వ‌ర‌కూ నెల్లూరు జిల్లాల‌కు చెందిన ఓ వ్య‌క్తికి క‌రోనా సోకింది అనేది తెలుసు ఏపీలో ఇది ఒక్కటే పాజిటీవ్ కేసు, కాని తాజాగా రెండో పాజిటీవ్ కేసు న‌మోదు అయింది, ప్ర‌కాశం జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఇక అటు మంగళగిరిలో ఓ యువతికి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరులోని ఐడీ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల విదేశాల నుంచి నెల్లూరుకు వచ్చిన ఒక వ్యక్తికీ వైరస్ సోకగా.. అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది. కేవలం స్కూళ్లు, కళాశాలలే కాకుండా.. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూతపడ్డాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.

ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ నుంచి మానవాళిని రక్షించడానికి శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. వైరస్‌ను కట్టడిచేసే వ్యాక్సిన్‌ను తయారుచేయడంలో పరిశోధకులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా రూపొందించిన ఓ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 8,960 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 2.19 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మంది మృతిచెందారు. ఒక్క రోజే మరణాల సంఖ్య 12 శాతం నమోదయ్యింది

ఎవ‌రికైనా ద‌గ్గు జ‌లులు లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లండి, అశ్రద్ద మాత్రం చేయ‌కండి.

వద్దన్నా క్రికెట్ ఆడిన పాకిస్తాన్.. ఇప్పుడు ఆటగాళ్లందరికి కరోనా ?

ఆసుపత్రిలో యువకుడితో నర్స్ శృంగారం… సీసీటీవీలో చూసి డాక్టర్స్ ఏం చేశారంటే

భారత్‌లో రెండో దశకు కరోనా.. ఇప్పుడే నియంత్రించకపోతే కష్టమే డేంజ‌ర్ సైర‌న్

Content above bottom navigation