పొంచి ఉన్న మరో పెద్ద ప్రమాదం.. ఇపుడు ఫెయిలైతే వైరస్ ను ఆపటం కష్టమేనా ?

109

కోవిడ్ 19 ప్రపంచాన్ని వణికిస్తుంది. దీని దెబ్బకు దేశాలకు దేశాలే లాక్ డౌన్ లో ఉండిపోయాయి. భారత్ లో గత 13 రోజులలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ మద్య డిల్లీ నిజాముద్దీన్ ఘటన తర్వాత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇధి ఇండియాకు చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ విషయంలో దేశానికి మరో తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. అదేమిటంటే ఏప్రిల్ 8, 9 తేదీల్లో ముస్లింలు పవిత్రంగా భావించే ’షబ్బే బరాత్ జాగ్నేకీ రాత్’ వస్తోంది. ఈ రెండు రోజులు ముస్లింలు పెద్ద ఎత్తున పండుగ జరుపుకునే రోజులన్న విషయం అందరికీ తెలిసిందే. పండుగ వాతావరణం అంటే మరి ఒకరింటికి మరొకరు వెళ్ళటం, వంటలను ఇచ్చిపుచ్చుకోవటం సాధారణమే కదా ? ప్రస్తుత కోవిడ్ 19 వ్యాప్తి విషయంలో దేశంలో ప్రమాదకర పరిస్దితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

Coronavirus cases rise to 30 in India; Ghaziabad man tests positive

నిజానికి వారం రోజులు క్రితం దేశంలో వైరస్ ఇంత ప్రమాదకరంగా లేదు. మార్చి 1 – 5 వ తేదీల మధ్య ఢిల్లీలోని మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్ధనలకు దేశం మొత్తం మీద 12 వేలమంది పాల్గొన్నారు. వీళ్ళంతా తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన తర్వాత నుండే వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దేశంలో నమోదైన 3100 కేసుల్లో మర్కజ్ కేసులే సుమారు వెయ్యికిపైగా ఉండటం గమనార్హం. ఈ సమస్యే నుండి ప్రభుత్వాలు బయటపడలేక నానా అవస్తలు పడుతున్న సమయంలో మళ్ళీ ఏప్రిల్ 8, 9 తేదీల్లో ముస్లింలు బయటకు వస్తే ఇంకేమైనా ఉందా ? అని ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే లాక్ డౌన్ అమలవుతున్న సందర్భంలో ముస్లింలెవరూ పై రెండు రోజులు రోడ్ల మీదకు రావద్దని, ప్రార్ధనల పేరుతో ఒకచోట చేరవద్దని ఢిల్లీ పోలీసులు పదే పదే అప్పీలు చేస్తున్నారు.

ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని కూడా హెచ్చరిస్తున్నారు. పైగా ముస్లింలను హెచ్చరిస్తు ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో పోస్టర్లను అంటించారు కూడా. అంతా బాగానే ఉంది. పోలీసుల హెచ్చరికలను ముస్లింలు వింటారా అన్న విషయంలోనే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి ప్రభుత్వ ఆదేశాలను పాటించే వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంది. కాకపోతే ఉల్లంఘించే వాళ్ళ వల్లల సమస్యంతా వస్తోంది. ఢిల్లీ పోలీసులు అప్పీలు చేస్తున్నారు బాగానే ఉంది. మరి మిగిలిన దేశం మాటేమిటి ? దేశవ్యాప్తంగా కోట్లమంది ముస్లింలున్నారు. మరి వాళ్ళంతా ఏమి చేస్తారో ఏమో ? పోలీసులు చెప్పినట్లుగా పై రెండు రోజుల్లో ముస్లింలెవరూ రోడ్లపైకి రాకపోతే అదే పెద్ద రిలీఫ్. ఒకవేళ పోలీసుల మాటలు లెక్కచెయ్యకుండా రోడ్లపైకి ముస్లింలు వస్తే కోవిడ్ 19 వ్యాప్తి మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

Content above bottom navigation