వుహన్ నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ చైనా కు కొత్త తలనొప్పి

266

కరోనా వైరస్ హుబె ప్రావిన్స్ లో నవంబర్ సెకండ్ వీక్ లో మొదలయ్యి మెల్లిగా జనవరి వరకు బలపడి, జనవరి నుంచి తీవ్రమైన ప్రభావం చూపించింది.  మొదట హుబె ప్రావిన్స్ లోని వుహాన్ నగరానికి పరిమితమైన కరోనా వైరస్ ఆ తరువాత వరసగా ప్రపంచవ్యాప్తం అయ్యింది.  రెండు నెలల తరువాత కరోనా వైరస్ చైనాలో మెల్లిగా తగ్గడం మొదలుపెట్టింది. 

నిన్నటి రోజున కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన సందర్భంగా వుహాన్ నగరంలోని కరోనా హాస్పిటల్ ను క్లోజ్ చేశారు.  అక్కడి నుంచి వైద్యులు, నర్సులు బయటకు వాస్తు మాస్క్ లు తీసి ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  చైనాలో 60వేల మంది పైగా ఈ వైరస్ నుంచి బయటపడినట్టుగా చైనా పేర్కొన్నది.  

షాకింగ్ కథనం: చైనాలో మళ్ళీ కరోనా కలకలం...

మిగతా కేసులు కూడా త్వరగా రికవరీ అవుతున్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  రికవరీ అయ్యితిరిగి వెళ్లిన కొంతమందికి తిరిగి  జలుబు, జ్వరం వంటివి రావడంతో హాస్పిటల్ కు తిరిగి వస్తున్నారట.  అలా వచ్చిన వాళ్లకు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది.  దీంతో చైనాకు కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి.  పూర్తిగా తగ్గిపోయిందని ఇంటికి వెళ్తున్న వ్యక్తులు ఇలా మరలా తిరిగి వస్తుండటం కలవర పెడుతున్నది.  సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చైనాలోని గాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన వాళ్లలో 14శాతం మంది కరోనా పాజిటివ్ తో తిరిగి హాస్పిటల్ కు వస్తున్నట్టు పేర్కొన్నది.  ఈ ప్రస్తుతం ఈ ప్రావిన్స్ లోనే ఇలాంటి కేసులు ఉంటున్నాయని, మిగతా ప్రాంతాల్లో కూడా ఇది జరిగే అవకాశం ఉన్నట్టుగా ఆ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొన్నది.  జియాంగ్సు, సిచువాన్ ప్రావిన్స్ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నట్టుగా కథనంలో పేర్కొన్నది. 

 

Content above bottom navigation