విశాఖ మహిళా అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన ఉద్యోగి

118

తెలంగాణ‌లో గ‌త కొద్ది నెల‌ల క్రితం పెట్రోల్ తో ఎమ్మార్వోపై దాడి చేసిన ఘ‌ట‌న‌ క‌ల‌క‌లం రేపింది
అత్యంత అమానుషంగా ఆమెపై పెట్రోల్ పోసి బూడిడ చేశాడు ఓ రైతు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఆనాడు ఓ రైతు చేతిలో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే చోటుచేసుకోవడంతో మిగిలిన ప్ర‌భుత్వ ఉద్యోగులు అంద‌రూ షాక్ అయ్యారు
అప్ప‌టి నుంచి అధికారులు ప్ర‌జ‌ల‌తో నేరుగా మాట్లాడేందుకు కొన్ని ష‌ర‌తులు కూడా పెట్టి ఆఫీసు రూమ్ లో చ‌ర్చిస్తున్నారు.
ఈ దాడుల‌తో కొంద‌రు గేట్లు ఏర్పాటు చేయించుకున్నారు.
అంతేకాదు బాటిల్స్ తీసుకువ‌స్తే పెట్రోల్ ఇచ్చేది లేదు అని కండిష‌న్ కూడా తీసుకువ‌చ్చారు.
మ‌రి తాజాగా అలాంటి ఘ‌ట‌న ఏపీలో క‌ల‌క‌లం రేపింది
అస‌లు విష‌యంలోకి వ‌స్తే.

విశాఖపట్నం జీవీఎంసీ 6వ జోన్ కార్యాలంలో ఈ కలకలం రేగింది. ప్రభుత్వ మహిళా అధికారిపై పెట్రోల్ దాడి ప్రయత్నం సంచలనం రేపింది. ఏఎంహెచ్‌వో లక్ష్మీ తులసిపై పెట్రోల్ పోసేందుకు అన్నామణి అనే మరో ఉద్యోగి ప్రయత్నం చేసింది. జీవీఎంసీ కార్యాలయానికి వచ్చిన అన్నామణి నేరుగా లక్ష్మీ తులసి దగ్గరకు వెళ్లింది. ఆమెతో మాట్లాడుతున్నట్లు నటించి.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ చల్లేందుకు ప్రయత్నించింది.. వెంటనే అప్రమత్తమైన తులసి పక్కకు జరిగారు.

ఏఎంహెచ్‌వోపై పెట్రోల్ పోయడాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే అన్నామణిని పట్టుకున్నారు. ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను లాక్కుని పక్కకు విసిరేసారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చారు. పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించిన అన్నామణిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.

అన్నామణి గోపాలపట్నం పరిధిలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కొద్దిరోజుల క్రితం సెలవులు పెట్టినందుకు జీతం కట్ చేసినందుకే ఈ దాడి చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్‌ దాడితో మరోసారి కలకలంరేపింది. విశాఖలో అధికారిణి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.అయితే చిన్న చిన్న కార‌ణాల‌కే ఇలా చంపే అంత ప‌గ‌లు ప్ర‌తీకారాలు పెంచుకోవ‌డం పై, వారి మాన‌సిక స్దితి కూడా అనుమానంగాఉంది, ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తూ సెలవులు పెడితే డ‌బ్బులు క‌ట్ చేయ‌డంలో త‌ప్పు ఏముంది అంటున్నారు జ‌నం… ఇలాంటి వారిని శిక్షించాల‌ని లేక‌పోతే మ‌ళ్లీ వీరిని చూసి ఇంకొంద‌రు త‌యారు అవుతారు అంటున్నారు ప్ర‌జ‌లు.

Content above bottom navigation