నూజివీడు లేడీస్ హాస్టల్లో యువకుడి ఘటనలో ట్విస్ట్.. కిటికీలు తీసిందెవరో తెలిస్తే షాక్..

82

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ మహిళా హాస్టల్లో యువకుడు చొరబడి ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. లేడీస్‌ హాస్టల్లో పట్టుబడ్డ యువకుడు కూడా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థేనని తెలిసింది. విద్యార్థిని సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆరుగురు విద్యార్థినులను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్‌ చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఎవరినీ సస్పెండ్‌ చేయలేదని తెలుస్తోంది.

విద్యార్థినులకు కేవలం కౌన్సెలింగ్‌ మాత్రమే ఇచ్చి పంపించివేశారని, యువకుడికి కూడా కౌన్సెలింగ్‌తో సరిపెట్టారని సమాచారం. దీంతో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేడీస్‌ హాస్టల్లో రోజంతా గడిపిన యువకుడిపై చర్యలు లేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి నివేదించేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీ ఘటనపై వైస్ చాన్సలర్ హేమచంద్రారెడ్డి స్పందించారు. సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే యువకుడు లేడీస్ హాస్టల్‌లోకి వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్ పాడవుతుందనే మౌనంగా ఉన్నట్లు చెప్పారు. బయటి నుంచి కిటికీ తీయడం చాలా కష్టమని, లోపలి నుంచి ఓపెన్ చేయటం సులువని తెలిపారు. లోపల ఉన్న వ్యక్తే కిటికీ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. ఫెస్ట్ జరుగుతున్న సమయంలో ఓ అమ్మాయి రూంలో ఉందని, అప్పుడే ఆమె కిటికీ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు.

ఈ క్రింది వీడియో చూడండి

అమ్మాయి కిటికీ తీయడంతోనే అబ్బాయి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోందని వీసీ చెప్పారు. ఉదయం నలుగురు అమ్మాయిల్లో ఓ అమ్మాయి మంచం కింద ఎవరో ఉన్నారని గుర్తించి వార్డెన్‌కు ఫిర్యాదు చేసిందన్నారు. అబ్బాయి, అమ్మాయి మైనర్లు కావటంతో ఇద్దరినీ తల్లిదండ్రులు దగ్గరకి పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వీసీ హేమచంద్రారెడ్డి తెలిపారు.ఈ మొత్తం వ్యవహారంపై క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపి విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీలో కీలక అధికారులు సెలవులో ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీలో సెక్యురిటీ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation