తెలంగాణలో యువతిపై ఆరుగురు గ్యాంగ్ రేప్‌… మామిడి తోటలోకి తీసుకెళ్లి దారుణంగా..

165

హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటన ఎంత కలవరం స్పృష్టించిందో మనకు తెలుసు. ఆ ఘటన తర్వాత యావత్తు భారతావని కదిలింది. మళ్ళి ఇలాంటి ఘటన జరగకూడదని అందరు కోరుకున్నారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తాం, ఆడపిల్లలను రక్షించుకుంటాం అని ప్రలోభాలు పలికింది. కానీ మళ్ళి మళ్ళి అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలూ వచ్చినా కూడా ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. రోజురోజుకు అమ్మాయిలపై జరిగే అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళి ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో ఓ యువతి పై ఆరుగురు మామాంధులు తమ ప్రతాపాన్ని చూపించారు. పూర్తీ వివరాల్లోకి వెళితే…

Image result for girls harassment

మహబూబాబాద్ జిల్లాకు చెందిన 24ఏళ్ళ ఓ యువతికి మతిస్తిమితం సరాగా లేదు. ఆమెకు ఎవ్వరూ లేరు. కొంత కాలం క్రితమే తల్లి చనిపోయింది. ఆమె మంచిచెడులు పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు. మతిస్థిమితం లేకపోవడంతో తండ్రికి చెప్పకుండానే బయటకు వెళ్లిపోయింది. అయితే ఆమెను బంధువులు అక్కున చేర్చుకున్నారు. దాంతో ఆమె హైదరాబాద్ కు షిప్ట్ అయ్యింది. అయితే ఆ యువతి మహబూబాబాద్ లో ఉన్నప్పుడే అదే ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలుడు పరిచయమయ్యాడు. అతడు క్యాటరింగ్‌ లో పని చేస్తాడు. ఆ యువతి హైదరాబాద్ వెళ్ళినప్పటినుంచి అతడు ఆమెతో తరుచూ ఫోన్ లో మాట్లాడేవాడు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌ లో తన బంధువుల ఇంట్లో ఉంటున్న ఆ యువతి శుక్రవారం ఇంటికి బయలుదేరింది. సికింద్రాబాద్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఆ బాలుడికి ఫోన్ చేసింది. దీంతో అతడు ఆమెను కలిసేందుకు రావాలని అడగగా మహబూబాబాద్‌లో రైలు దిగి ఆటోలో రాత్రి 7గంటల సమయంలో వెళ్లింది. అక్కడ యువతిని కలుసుకున్న బాలుడు రాత్రి 8.30 గంటల సమయంలో మహబూబాబాద్‌ రహదారిలో ఉన్న ఓ మామిడితోటలోకి ఆమెను బెదిరించి తీసుకు వెళ్ళాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

అది చాలదంటూ ఆ అఘాంతకుడు తన స్నేహితులైన శ్రీకాంత్ (18) అనే మరో యువకుడికి ఫోన్ చేశారు. ఆ యువకుడితో పాటు మరో ఇద్దరు కుర్రాళ్ళు రాగా. నలుగురు బాలురు మామిడితోటకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు భయంతో కేకలు వేయగా అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గమనించారు. వెంటనే తోట యజమానికి ఫోన్‌ చేశారు. అతడు అక్కడికి చేరుకోగా ఆయనను చూసి ఆరుగురు కామాంధులు పరారయ్యారు. అయితే ఈ ఘటనపై స్థానికులు వెంటనే డయల్ 100కి ఫోన్ చెప్పడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆమె చెప్పిన వివరాలు, కాల్స్‌ డేటా ఆధారంగా ఐదుగురు మైనర్లను శనివారం అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో ఉన్న శ్రీకాంత్‌ కోసం గాలిస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation