APలో మహిళా కండక్టర్ కు కరోనా.. బస్సు ఆపి ఏం చేసారో చూడండి

60

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీలో విశాఖ జిల్లాల్లో కరోనా వ్యాపించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన 8 మందిలో కరోనా లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది.విశాఖపట్టణంలోని రాంనగర్‌లోని ఓ కుటుంబంలో ముగ్గురికి ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. వీరు ఇటీవలే కౌలాలంపూర్‌కు వెళ్లి వచ్చారు. అలాగే గాజువాకలోని ఓ యువతి, ఆమె ఫ్రెండ్‌కు కూడా వైరస్ లక్షణాలున్నాయని నిర్ధారించారు. ప్రస్తుతం విశాఖలోని చెస్ట్ ఆస్పత్రిలో ఐదుగురికి చికిత్స చేస్తున్నారు వైద్యులు.

Image result for APలో మహిళా కండక్టర్ కు కరోనా

ఇలా తెలంగాణతో పాటూ ఏపీలో కూడా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో కొంతమంది కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు.. వారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లాలో ఓ మహిళ కండక్టర్ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు ఇదే పెను సంచ‌ల‌నం అయింది.తాజాగా తెలంగాణలోని సత్తుపల్లి నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానాలు వచ్చాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులు, బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యారు. చింతలపూడిలో బస్సును ఆపి.. మహిళా కండక్టర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ సేకరించే పనిలో ఉన్నారు. రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించి వైరస్ ఉందా.. లేదా అన్నది నిర్ధారిస్తామంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని సిద్ధం చేస్తున్నారు. పలువురు అనుమానితుల్ని వార్డులకు తరలించారు.. ల్యాబ్ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఏపీలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదంటున్నారు అధికారులు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే.. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇలా క‌రోనా ల‌క్ష‌ణాలు మీకు క‌నిపిస్తే ఎలాంటి ప‌నులు చేయ‌కండి.. అలాగే కుటుంబ స‌భ్యుల‌కి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు, ఇటీవ‌ల విమాన ప్ర‌యాణాల్లో ఎయిర్ హోస్టెస్ కి కూడా ఇరువురికి క‌రోనా సోకింది… అందుకే బ‌స్సులు ట్రైన్ల‌లో చాలా జాగ్రత్త‌లు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation