ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కళాశాల ఉండేలా రాష్ట్రంలో మొత్తం 30 కశాశాలల నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.